logo

వణికించిన వడగళ్లు

రాజధానిలోని పలు ప్రాంతాల్లో శనివారం వడగళ్ల వాన కురిసింది. ఉదయం నుంచి వాతావరణం మేఘావృతమై ఉండగా, సాయంత్రం 5గంటల నుంచి వేర్వేరు ప్రాంతాల్లో వరుణుడు విజృంభించాడు.

Published : 19 Mar 2023 03:15 IST

కేపీహెచ్‌బీ, కుత్బుల్లాపూర్‌, జీడిమెట్ల ప్రాంతాల్లో భారీ వర్షం

ప్రగతినగర్‌లోని ఓ భవనం బాల్కనీలో పడిన వడగళ్లు

ఈనాడు, హైదరాబాద్‌ : రాజధానిలోని పలు ప్రాంతాల్లో శనివారం వడగళ్ల వాన కురిసింది. ఉదయం నుంచి వాతావరణం మేఘావృతమై ఉండగా, సాయంత్రం 5గంటల నుంచి వేర్వేరు ప్రాంతాల్లో వరుణుడు విజృంభించాడు. కుత్బుల్లాపూర్‌, కేపీహెచ్‌బీ, జీడిమెట్ల, శామీర్‌పేట, నాగారం, దమ్మాయిగూడ ప్రాంతాల్లో దంచి కొట్టింది. మరోవైపు కుండపోత వానతో ఆయా ప్రాంతాల్లోని ప్రధాన కూడళ్లలో మోకాలు లోతు నీరు నిలిచి ట్రాఫిక్‌ స్తంభించిపోయింది.  ఈదురుగాలులు బలంగా వీచాయి. నూతన సచివాలయం సమీపంలో భారీ వృక్షం నేలకొరిగింది.గాజులరామారంలో గరిష్ఠంగా 4.35సెం.మీ వర్షం పడగా, జీడిమెట్లలో 4.05, కూకట్‌పల్లి హైదర్‌నగర్‌లో 3.55, ఆర్‌.సి.పురంలో 2.58, కేపీహెచ్‌బీలో 2.45, చందానగర్‌లో 1.75, రెడ్‌హిల్స్‌లో 1.68, గచ్చిబౌలిలో 1.65, బాలానగర్‌లో 1.58 సెం.మీ.ల వర్షపాతం నమోదైంది.

నూతన సచివాలయం సమీపంలో కూలిన చెట్టు

తొమ్మిదేళ్ల తర్వాత: మార్చి నెలలో తొమ్మిదేళ్ల తర్వాత అత్యధిక వర్షపాతం నమోదైంది. 2014, మార్చి 5న 3.84సెం.మీ వర్షం పడగా, ఆ తర్వాత ఇన్నేళ్లకు శనివారం 4.35సెం.మీ వాన పడిందని అధికారులు తెలిపారు.


వానొచ్చింది... ముంచెత్తింది

గౌతంనగర్‌: శనివారం సాయంత్రం  కురిసిన భారీ వర్షానికి మల్కాజిగిరిలోని పలు కాలనీలు జలమయం అయ్యాయి. గౌతంనగర్‌ డివిజన్‌ జ్యోతినగర్‌, వెంకటాద్రినగర్‌, న్యూమిర్జాలగూడ, రాజాశ్రీనివాసనగర్‌ కాలనీల  ప్రజలు ఇబ్బందులు పడ్డారు. రామాంజనేయనగర్‌, హిల్‌టాప్‌కాలనీల నుంచి వరద పోటెత్తడంతో వాహనాలు నీట మునిగాయి.

వెంకటాద్రినగర్‌లో వరద నీరు


పేట్‌బషీరాబాద్‌ ఠాణా సమీపంలో జాతీయ రహదారిపై గాలికి విరిగిన విద్యుత్తు స్తంభం

చందానగర్‌లో ఈదురుగాలులు

భారీ వర్షంతో పంజాగుట్ట మెట్రో స్టేషన్‌ వద్ద నిలిచిన  వరద నీటిలో వెళ్తున్న వాహనదారులు

కూకట్‌పల్లి జాతీయ రహదారిపై రెండువైపులా భారీగా బారులుతీరిన వాహనాలు

యాచారం మండలం మంతన్‌గౌరెల్లిలో వడగళ్లకు రేకులు పగలకుండా తుంగ కప్పుతూ..

జూబ్లిహిల్స్‌లో ఫ్లైఓవర్‌ పైనుంచి పడుతున్న వర్షం నీరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని