Weather Forecast: తెలంగాణలో మరో రెండ్రోజుల పాటు వర్షాలు

తెలంగాణలో మరో రెండ్రోజుల పాటు అక్కడకక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. 

Updated : 19 Mar 2023 18:13 IST

హైదరాబాద్‌: తెలంగాణలో మరో రెండ్రోజుల పాటు అక్కడకక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. నిన్న ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రస్తుతం దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి పశ్చిమ విదర్భ వరకు ఉత్తర అంతర్గత కర్ణాటక, మరఠ్వాడా మీదుగా సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఈరోజు రాష్ట్రంలో చాలా చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదరుగాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని