logo

ప్రశ్నాపత్రాల లీకేజీపై సీబీఐ విచారణ చేయించాలి: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

టీఎస్‌పీఎస్సీలో ఇప్పటివరకు 15 ప్రశ్నాపత్రాలు లీకయ్యాయని, వీటన్నింటిపై సీబీఐ విచారణ చేయాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు.

Updated : 19 Mar 2023 20:01 IST

పంజాగుట్ట: టీఎస్‌పీఎస్సీలో ఇప్పటివరకు 15 ప్రశ్నాపత్రాలు లీకయ్యాయని, వీటన్నింటిపై సీబీఐ విచారణ చేయాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం లక్డీకాపూల్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. మార్చి 11వతేదీన టీఎస్‌పీఎస్సీ అధికారులు వెబ్‌సైట్‌ హ్యాక్‌ అయిందని పోలీసు కేసు పెట్టారని తెలిపారు. ఈ కేసును సిట్‌కు బదిలీ చేశారని చెప్పారు. సిట్‌ కార్యాలయంలో కూర్చోవడానికి కుర్చీలే ఉండవని.. వాళ్లెలా విచారణ చేస్తారని అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయంపై సీఎం, మంత్రులు మౌనం పాటిస్తున్నారని తెలిపారు. మంత్రి కేటీఆర్ ఇదో చిన్న విషయమని సంబోధిస్తున్నారని చెప్పారు. తెలంగాణలోని నిరుద్యోగుల భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారిందని ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. కార్యక్రమంలో బీఎస్పీ అధికార ప్రతినిధి వెంకటేశ్‌ చౌహాన్‌, అరుణ క్వీన్‌, సాంబశివగౌడ్, శైలజ, దయానంద్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని