logo

రైతులను ఆదుకోవాలని వినతి

వికారాబాద్‌ నియోజక వర్గంలో వడగళ్ల వానకు పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతూ ఆదివారం రాష్ట్ర వ్యయసాయ శాఖా మంత్రి నిరంజ్‌రెడ్డికి మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్‌ వినితి పత్రం అందజేశారు.

Published : 20 Mar 2023 02:28 IST

వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డికి వినతి పత్రం అందజేస్తున్న మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్‌

వికారాబాద్‌ న్యూస్‌టుడే: వికారాబాద్‌ నియోజక వర్గంలో వడగళ్ల వానకు పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతూ ఆదివారం రాష్ట్ర వ్యయసాయ శాఖా మంత్రి నిరంజ్‌రెడ్డికి మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్‌ వినితి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నడూ  ఇలాంటి వడగళ్ల వాన చూడలేదన్నారు.  నియోజక వర్గంలోని మర్పల్లి, మోమిన్‌పేట మండలల్లో ఎక్కువగా దెబ్బతిన్నాయని ఆయన తెలిపారు. అంచనా వేసి నష్టపరిహారాన్ని అందజేయాలన్నారు. టమాట, మొక్కజొన్న, జొన్న, క్యాబేజీ, క్యాలీఫ్లవర్‌, మామిడి, కుసుమ, ఉల్లిగడ్డ, బొప్పాయి వంటి పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. మర్పల్లి, మోమిన్‌పేట మండలాల్లో ఎక్కువగా దెబ్బతిన్నాయని ఆయన వివరించారు. 

మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్‌

మోమిన్‌పేట: రైతులకు చాలీచాలని పంట పెట్టుబడులు ఇవ్వడం కాదు, విపత్తు సమయంలో అండగా నిలవాలని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్‌ అన్నారు. ఇటీవలే కురిసిన వడగళ్ల వర్షాలకు మండల పరిధిలోని అమ్రాకుర్దులో దెబ్బ తిన్న పంటలను ఆయన ఆదివారం స్థానిక కాంగ్రెస్‌ పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరిగ్గా పంటలు చేతి కొచ్చే సమయానికి అకాల వర్షాలు రైతులను కోలుకోని దెబ్బతీశాయన్నారు.  పార్టీ మండల అధ్యక్షుడు, శంకర్‌ నాయకులు సురేందర్‌, సిరాజొద్దీన్‌, సుభాష్‌, అస్తామ్‌, ఎజాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని