logo

తప్పిపోయిన యువకుడి అప్పగింత

తప్పిపోయిన ఓ యువకుడిని మోమిన్‌పేట ఠాణా పోలీసులు అతని తల్లిదండ్రులకు అప్పగించారు. ఆదివారం ఎస్సై విజయ్‌ ప్రకాష్‌ తెలిపిన వివరాలు.

Published : 20 Mar 2023 02:28 IST

తల్లిదండ్రులతో యువకుడు, పోలీసులు, నిర్వాహకులు

మోమిన్‌పేట: తప్పిపోయిన ఓ యువకుడిని మోమిన్‌పేట ఠాణా పోలీసులు అతని తల్లిదండ్రులకు అప్పగించారు. ఆదివారం ఎస్సై విజయ్‌ ప్రకాష్‌ తెలిపిన వివరాలు.. పోలీసులు ఈ నెల 12న రాత్రిపూట గస్తీ నిర్వహిస్తుండగా ఒడిశా రాష్ట్రంలోని కేశర జిల్లాలో గోబిందపూర్‌ గ్రామానికి చెందిన అశోక్‌గౌడ్‌ (19) బూర్గుపల్లి బస్టాండ్‌ సమీప పరిసర ప్రాంతాలలో చలికి వణుకుతూ కనిపించాడు. వివరాలు తెలుసుకుందామని రాత్రి పూట ఎక్కడి వెళ్తున్నావని అశోక్‌గౌడ్‌ను ప్రశ్నించగా ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. అతని స్థితిని గమనించి అదే సమయంలో సమీపాన ఉన ఓ హోటల్‌లో భోజనం పెట్టించారు. మోమిన్‌పేటలో అనాథ పిల్లల కోసం ఉన్న ఆల్‌ హెల్ప్‌ సొసైటీ నిర్వాహకుడు సుందరానికి అప్పగించారు. మరుసటి రోజు యువకుడికి జ్వరం రావడంతో స్థానికంగా ఉన్న ఓ ప్రవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించారు. ఆ సమయంలో వివరాలు తెలుసుకునేందుకు యువకుడికి పేపరు ఇవ్వగా పేరు మాత్రమే రాశాడు. అతని పేరు (అశోక్‌గౌడ్‌), వయసును సూచిస్తూ పోలీసుల అంతర్జాలం (ఆన్‌లైన్‌)లో వెతకడం ప్రారంభించారు. హైదరాబాద్‌ నగరంలోని సైదాబాద్‌ పోలీసు ఠాణాలో పది రోజులుగా అశోక్‌గౌడ్‌ (మిస్సింగ్‌) కనిపించడం లేదని గత నెల 21న కేసు నమోదైనట్లు తెలుసుకున్నారు. అక్కడి పోలీసులకు సమాచారం అందించగా వారు ఫిర్యాదుదారుల చరవాణి నంబర్లు ఇవ్వడంతో శుక్రవారం సమాచారం అందించారు. అతని తల్లిదండ్రులు శనివారం రాత్రి ఠాణా పోలీసులను సంప్రదించగా, పూర్తి వివరాలు సేకరించి యువకుడిని అప్పగించినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు