logo

చేలల్లో నీళ్లు.. కర్షకులకు కన్నీళ్లు

అకాల వర్షాలకు అన్నదాతలు ఆగమవుతున్నారు. నాలుగు రోజులుగా వర్షాకాలాన్ని తలపించే విధంగా కురుస్తున్న వర్షాలకు చేతికొచ్చిన పంట దెబ్బతినడంతో పెట్టుబడి సైతం వచ్చే పరిస్థితి లేదని వాపోతున్నారు.

Published : 20 Mar 2023 02:28 IST

టేకులపల్లిలో ఉల్లిపంటను చూసి విలపిస్తున్న రైతు

నవాబ్‌పేట, న్యూస్‌టుడే: అకాల వర్షాలకు అన్నదాతలు ఆగమవుతున్నారు. నాలుగు రోజులుగా వర్షాకాలాన్ని తలపించే విధంగా కురుస్తున్న వర్షాలకు చేతికొచ్చిన పంట దెబ్బతినడంతో పెట్టుబడి సైతం వచ్చే పరిస్థితి లేదని వాపోతున్నారు. శనివారం రాత్రి అధిక వర్షం కురియడంతో పంటలకు మరింత నష్టం వాటిల్లింది.  మండలంలోని ఆయా గ్రామాల్లో ఉల్లి, టమాట, క్యాబేజీ ఇతర కూరగాయల పంటలతో పాటు, మొక్కజొన్న, కుసుమ ఇతర పంటలు నేల వాలాయి. 

చించల్‌పేటలో నేలవాలిన ఉల్లిపంట 

మోమిన్‌పేట: మండలంలో వరుసగా కురుస్తున్న వడగళ్ల వానలు రైతులను కన్నీరు పెట్టిస్తున్నాయి.  గ్రామాలలో కోతకు వచ్చిన ఉల్లి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. టేకులపల్లి గ్రామానికి చెందిన రైతు రెడ్డిపల్లి దుర్గయ్య ఎకరాకు రూ.15 వేల పెట్టుబడి పెట్టి మూడు ఎకరాల్లో సాగు చేశాడు. చేతికందిన పంటను మూడు రోజులలో కోత తీద్దామనుకున్నాడు. ఇంతలోనే కురిసిన అకాల వర్షం పూర్తిగా ముంచేసింది. అమ్రాదికుర్దు, మోరంగపల్లి గ్రామాలలో మక్కజొన్న పంటలు నేలపాలయ్యాయి. అమ్రాదికుర్దులో ఆదివారం రాత్రికూడా ఇళ్ల ముందు, పొలాల్లో వడగళ్లు పడ్డాయి.

అమ్రాదికుర్దులో మక్కజొన్న

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని