logo

కుటుంబ కలహాల నేపథ్యం.. భర్తను హతమార్చిన భార్యకు రిమాండు

కుటుంబ కలహాల నేపథ్యంలో దంపతుల మధ్య గొడవ జరిగింది. ఆగ్రహించిన భార్య భర్తను కడతేర్చిన ఘటన ఆదిభట్ల ఠాణా పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Published : 20 Mar 2023 01:49 IST

తుర్కయంజాల్‌ పురపాలిక: కుటుంబ కలహాల నేపథ్యంలో దంపతుల మధ్య గొడవ జరిగింది. ఆగ్రహించిన భార్య భర్తను కడతేర్చిన ఘటన ఆదిభట్ల ఠాణా పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు, బంధువులు కథనం ప్రకారం. తుర్కయంజాల్‌లో నివసించే చెక్క పొన్నయ్య(52), యాదమ్మ(46) భార్యాభర్తలు. వీరి కొడుకు, కూతురు పెళ్లిళ్ల తరువాత వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడ్డారు. యాదమ్మ జీహెచ్‌ఎంసీలో స్వీపరుగా, పొన్నయ్య కూలీపని చేస్తాడు. తరచూ గొడవ పడుతుంటారు. ఈనెల 17న రాత్రి ఇద్దరూ కల్లు తాగిన మత్తులో ఓ విషయంలో తీవ్రంగా గొడవపడ్డారు.  సహనం కోల్పోయిన యాదమ్మ తన భర్త ముఖంపై దిండుతో అదిమి పట్టి ఊపిరాడకుండా చేసి హతమార్చింది. అదేరోజు రాత్రి ఇంట్లోంచి వెళ్లిపోయింది. ఆ రోజు ఉదయం మృతుడి తమ్ముడు వారిఇంట్లోకి వెళ్లాడు. యాదమ్మ కనిపించకపోగా పొన్నయ్య మృతి చెంది ఉన్నాడు. ఆదిభట్ల పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పొన్నయ్య హత్యకు గురైనట్లు గుర్తించారు. కేసు నమోదుచేసిన పోలీసులు ఆదివారం యాదమ్మను అదుపులోకి తీసుకుని రిమాండుకు తరలించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు