‘ప్రశ్నపత్రాల లీకేజీపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి’
టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు.
సమావేశంలో మాట్లాడుతున్న ఆర్.కృష్ణయ్య, చిత్రంలో అనంతయ్య, రాజేందర్,
గుజ్జ సత్యం, నీల వెంకటేష్, వేముల రామకృష్ణ, గణేష్, నరేష్ తదితరులు
నల్లకుంట, న్యూస్‌టుడే: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. శిక్షణ తీసుకున్న నిరుద్యోగులకు రూ.50 వేలు అందజేయాలని కోరారు. ఆదివారం విద్యానగర్ బీసీ భవన్‌లో జరిగిన బీసీ సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు. లీకేజీ వ్యవహారం వల్ల సుమారు 25 లక్షల మంది నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ నిరుద్యోగ ఐకాస ఛైర్మన్ నీల వెంకటేష్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ వేముల రామకృష్ణ, బీసీ కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు సి.రాజేందర్, బీసీ ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అనంతయ్య, నేతలు గణేష్, నరేష్ పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
భారతీయులకు వీసాల మంజూరులో జాప్యమేల?
-
Crime News
ప్రియుడి మర్మాంగం కోసిన యువతి
-
Ts-top-news News
భారత్లో మహిళలకు బైపాస్ సర్జరీ అనంతర ముప్పు తక్కువే!
-
Ap-top-news News
తిరుమల గగనతలంలో విమానాలు
-
Sports News
బ్యాటింగ్ ఎంచుకోవాల్సింది: మాజీ కోచ్ రవిశాస్త్రి
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (09/06/2023)