రూ.100కోట్ల నిధులున్నా అందుకోలేని ఓయూ
విశ్వవిద్యాలయ అభివృద్ధికి నిధులిస్తున్న ‘రూసా’(రాష్ట్రీయ ఉచ్ఛతార్ శిక్ష అభియాన్) మంజూరు చేసే రూ.40కోట్ల నిధులకు అవసరమైన ప్రతిపాదనలను పంపేందుకు ఓయూ అధికారులు ముందూ.. వెనకా చూసుకుంటున్నారు.
‘రూసా’కు ప్రతిపాదనలు పంపేందుకు ఆటంకాలు..
ఈనాడు, హైదరాబాద్: విశ్వవిద్యాలయ అభివృద్ధికి నిధులిస్తున్న ‘రూసా’(రాష్ట్రీయ ఉచ్ఛతార్ శిక్ష అభియాన్) మంజూరు చేసే రూ.40కోట్ల నిధులకు అవసరమైన ప్రతిపాదనలను పంపేందుకు ఓయూ అధికారులు ముందూ.. వెనకా చూసుకుంటున్నారు. నిధులు కేటాయిస్తున్న ‘రూసా’ అవి సక్రమంగా వినియోగమయ్యేందుకు షరతులు విధించింది. జాతీయ ప్రమాణాల మేరకు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఆచార్యులు, సహాయ ఆచార్యులుండాలి. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని కొన్ని కీలకమైన విభాగాల్లో ఆచార్యులు, సహాయ ఆచార్యులు లేకపోవడంతో ప్రతిపాదనలు పంపడం లేదు. ‘రూసా’ అధికారులు పలుమార్లు లేఖలు రాసినా స్పందించడం లేదు. అభివృద్ధి పనులు, పరిశోధన కోసం రూ.15కోట్ల ప్రణాళికను పంపాలంటూ కొద్దిరోజుల క్రితం సంప్రదించినా సమాధానం లేదు.
ఏడాదిగా అడుగుతున్నా..
ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ‘రూసా-2’ పథకం కింద రూ.100కోట్లు మంజూరయ్యాయి. తొలిదశలో రూ.40కోట్ల నిధులు ఖర్చుచేసేందుకు ‘రూసా’ అధికారులు ఓయూ పరిపాలనా విభాగానికి అనుమతులిచ్చారు. కరోనా ప్రభావం తగ్గాక రూ.16.67 కోట్లతో విద్యార్థులకు కొత్తగా వసతి గృహాలు, క్యాంపస్‌లోని కొన్ని విభాగాలను ఆధునికీకరించారు. అనంతరం రూ.25కోట్లకు ప్రతిపాదనలు పంపించాలంటూ ‘రూసా’ అధికారులు గతేడాది నుంచి అడుగుతూనే ఉన్నారు. విద్యార్థుల సంఖ్యకు, ఆచార్యులు, సహాయ ఆచార్యుల సంఖ్యకు సరిపోలకపోవడంతో ప్రతిపాదనలు, ప్రణాళికలను పక్కనపెట్టేశారు. ఆచార్యులు, సహాయ ఆచార్యుల పోస్టులు భర్తీ చేయడం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. ఈ విషయాన్ని ‘రూసా’ అధికారులకు వివరిస్తే వారు కూడా నిధుల సాధనకు ప్రత్యామ్నాయ మార్గాలను చూపించే వీలుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Train Accident: కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం.. పలు రైళ్ల రద్దు, కొన్ని దారి మళ్లింపు
-
World News
Restaurant: ఎక్కువ ఆహారాన్ని ఆర్డర్ చేస్తే ఇలా అవమానిస్తారా..!
-
India News
Train Accident: ‘కోరమాండల్’ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం.. ఉలిక్కి పడిన 4 రాష్ట్రాలు
-
World News
Ukraine: జెలెన్స్కీ ఇంటి ఎదుట ‘నాటు-నాటు’ పాటకు దుమ్ములేపిన ఉక్రెయిన్ సైనికులు
-
Movies News
Samantha: ప్రియాంక చోప్రా తల్లిగా సమంత.. సమాధానం వచ్చినా సందేహమే!
-
India News
1945 నుంచి.. ఆ చర్చిలో 927 మందిపై లైంగిక వేధింపులు!