logo

మామిడిపల్లి పండ్ల మార్కెట్‌ సిద్ధం

గతంలో పండ్ల విక్రయాలకు కొత్తపేటలోని గడ్డిఅన్నారం హోల్‌సేల్‌ మార్కెట్‌ అందుబాటులో ఉండేది.

Published : 20 Mar 2023 02:27 IST

రూపుదిద్దుకుంటున్న మార్కెట్‌

ఈనాడు, హైదరాబాద్‌:  గతంలో పండ్ల విక్రయాలకు కొత్తపేటలోని గడ్డిఅన్నారం హోల్‌సేల్‌ మార్కెట్‌ అందుబాటులో ఉండేది. ఇప్పుడు మార్కెట్‌ బాటసింగారం తరలడంతో వ్యాపారులకు రవాణా ఖర్చులే తడిచి మోపెడవుతున్నాయి. దీన్ని అధిగమమించడానికి పహాడీషరీఫ్‌లోని మామిడిపల్లిలో కొత్తగా మార్కెట్‌ను ఏర్పాటు చేశారు.   పండ్లను వేలం వేసుకోవడానికి వీలుగా ప్లాట్‌ఫామ్స్‌ నిర్మించారు. కమీషన్‌ ఏజెంట్ల కార్యాలయాలు కూడా సిద్ధమయ్యాయి.

త్వరలోనే ప్రారంభం.. సుమారు 12 ఎకరాల వక్ఫ్‌ల్యాండ్‌లో ఏర్పాటు చేసిన మార్కెట్‌లో రంజాన్‌ మాసారంభం నుంచి క్రయవిక్రయాలు మొదలవుతాయని మార్కెట్‌ కమిటీ ప్రధాన కార్యదర్శి మునీరుద్దీన్‌ ప్రకటించారు. మామిడిపల్లిలోని హోల్‌సేల్‌ పండ్ల మార్కెట్‌ను జనవరి 2న ప్రారంభించినా పూర్తి స్థాయిలో అమ్మకాలు మొదలుకాలేదు. దాదాపు 150 మంది కమీషన్‌ ఏజెంట్లు ఇక్కడ ఉన్నారు. ప్రైవేటు మార్కెట్ల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం బిల్లును ఆమోదించిన నేపథ్యంలో ఏజెంట్లకు లైసెన్సులు మంజూరు చేయడానికి వీలు కలిగింది. వీరి ఆధ్వర్యంలోనే మార్కెట్‌ కార్యకలాపాలు సాగుతున్నా.. మార్కెటింగ్‌ శాఖ పర్యవేక్షణలోనే అమ్మకాలు, కొనుగోళ్లు జరుగుతాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని