logo

విభిన్న రంగాల్లో మహిళల కృషి అభినందనీయం: గవర్నర్‌

తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (టీటీఏ) ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఆదివారం వర్చువల్‌గా నిర్వహించారు.

Published : 20 Mar 2023 02:27 IST

వర్చువల్‌గా మాట్లాడుతున్న గవర్నర్‌ తమిళిసై 

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (టీటీఏ) ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఆదివారం వర్చువల్‌గా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్‌ డా.తమిళిసై సౌందరరాజన్‌ ప్రసంగిస్తూ టీటీఏ సేవలను కొనియాడారు.  ఆరోగ్యంతో పాటు వివిధ రంగాల్లో మహిళలు చేసిన కృషి చేశారని ప్రస్తావిస్తూ, మరింత మంది మహిళలు ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు.  టీటీఏ అధ్యక్షుడు వంశీరెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచంలోని బహుళజాతి సంస్థలలో మహిళల కృషిని వివరిస్తూ, సమాజ సేవలోనూ కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. టీటీఏ వ్యవస్థాపకుడు డా.పైళ్ల మల్లారెడ్డి, సలహామండలి ఛైర్‌ డా.హరనాథ్‌ రెడ్డి, కో-ఛైర్‌ మోహన్‌ పట్లోళ్ల, సభ్యులు విజయపాల్‌ తదితరులు సమాజానికి మహిళలు చేస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. అపోలో హాస్పిటల్స్‌ జాయింట్‌ ఎండీ డా.సంగీతారెడ్డి ఆరోగ్య సంరక్షణలో మహిళలు పోషిస్తున్న పాత్ర, సంస్థ తీసుకుంటున్న చర్యలను వివరించారు. అనంతరం అందాల పోటీలో విజేతలను న్యాయనిర్ణీతల కమిటీ ప్రకటించింది. రమ్య అయ్యంకి విజేతగా నిలువగా, నీలిమ మొదటి, సౌమ్య పందిరి 2వ రన్నరప్‌లు నిలిచారు. కార్యక్రమాన్ని టీటీఏ మహిళా నాయకులు స్వాతి చెన్నూరి, సంగీతరెడ్డి, కవితారెడ్డి, ఉషారెడ్డి, రామవనమ, ప్రియాంక నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని