logo

‘ఫులే ఆదర్శంగా రాష్ట్రంలో సంక్షేమ పాలన’

మహాత్మా జ్యోతిరావు ఫులే, సావిత్రిబాయి ఫులే ఆదర్శాలతో పేదల అభ్యున్నతే ధ్యేయంగా రాష్ట్రంలో సంక్షేమ పాలనను సీఎం కేసీఆర్‌ తీసుకొచ్చారని బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌ రావు అన్నారు.

Published : 20 Mar 2023 02:27 IST

నివాళులర్పిస్తున్న వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, కుమారస్వామి తదితరులు

హయత్‌నగర్‌, న్యూస్‌టుడే: మహాత్మా జ్యోతిరావు ఫులే, సావిత్రిబాయి ఫులే ఆదర్శాలతో పేదల అభ్యున్నతే ధ్యేయంగా రాష్ట్రంలో సంక్షేమ పాలనను సీఎం కేసీఆర్‌ తీసుకొచ్చారని బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌ రావు అన్నారు. హయత్‌నగర్‌లోని అంబేడ్కర్‌ చౌరస్తాలో జ్యోతిరావు ఫులే, సావిత్రిబాయి ఫులే జంట విగ్రహాల ఆవిష్కరణ ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా సామాజిక న్యాయ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీసీ దళ్‌  జాతీయ అధ్యక్షుడు దండ్రు కుమారస్వామితో కలిసి మహనీయుల దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కర్మన్‌ఘాట్‌ ఆంజనేయ స్వామి మందిరం ఛైర్మన్‌ ఈశ్వరమ్మ యాదవ్‌, విగ్రహాల ఆవిష్కరణ కమిటీ ప్రతినిధులు ఎర్ర రవీందర్‌, పారంద స్వామి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని