logo

సమాజాన్ని కాపాడేది సాహిత్యం

సమాజాన్ని కాపుకాసేది సాహిత్యం అని కవి కె.శివారెడ్డి అన్నారు. కత్తి పద్మ రచించిన ‘చీకటి పువ్వు’ కథల పుస్తక పరిచయ సభ ఆదివారం రవీంద్రభారతిలో నిర్వహించారు.

Published : 20 Mar 2023 02:27 IST

‘చీకటి పువ్వు’ తొలి ప్రతిని కృష్ణక్కకు అందజేసిన రచయిత్రి కత్తి పద్మ,
చిత్రంలో వసీరా, సతీష్‌చందర్‌, శివారెడ్డి, కాత్యాయని, ఏకే ప్రభాకర్‌

రవీంద్రభారతి, న్యూస్‌టుడే: సమాజాన్ని కాపుకాసేది సాహిత్యం అని కవి కె.శివారెడ్డి అన్నారు. కత్తి పద్మ రచించిన ‘చీకటి పువ్వు’ కథల పుస్తక పరిచయ సభ ఆదివారం రవీంద్రభారతిలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ పుస్తకం జీవన కావ్యమని, మనం చూడని ఎన్నో విషయాలు అక్షరరూపంలో రచయిత్రి అందించారన్నారు. ఇందులోని కథలు, పాత్రలు సృష్టించినవి కాదని, ఉద్యమజీవితంలో రచయిత్రి చూసిన జీవితాలని పేర్కొన్నారు. సాహితీవేత్త కాత్యాయని ప్రసంగిస్తూ.. వైవిధ్యమైన కథలను తనదైనశైలిలో ఆవిష్కరించారని పేర్కొన్నారు. సాహితీవేత్త సతీష్‌చందర్‌ మాట్లాడుతూ.. పుస్తకంలోని కథల్లో లీనమై చదివినప్పుడే అందులోని భావాన్ని అర్ధం చేసుకోగలమన్నారు. నాలుగు దశాబ్దాలు ప్రజాక్షేత్రంలో  ఉన్నా పద్మ కొంత ఆలస్యంగా అయినా సాహితీ క్షేత్రంలోని అడుగుపెట్టారని రచయిత ఏకే ప్రభాకర్‌ పేర్కొన్నారు. కార్యక్రమానికి వర్మ సమన్వయకర్తగా వ్యవహరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని