logo

బీసీల సమస్యలపై దేశవ్యాప్త ఉద్యమం

బీసీల సమస్యలపై దేశవ్యాప్త ఉద్యమం చేపట్టినట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధికార ప్రతినిధి, దిల్లీ ఇన్‌ఛార్జి, ఆంధ్రప్రదేశ్‌ స్వర్ణకారుల సంఘం అధ్యక్షుడు కర్రి వేణుమాధవ్‌ తెలిపారు.

Published : 20 Mar 2023 02:27 IST

మాట్లాడుతున్న వేణుమాధవ్‌, చిత్రంలో శుభప్రద్‌, కోల జనార్దన్‌, గుజ్జ కృష్ణ

కాచిగూడ, న్యూస్‌టుడే: బీసీల సమస్యలపై దేశవ్యాప్త ఉద్యమం చేపట్టినట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధికార ప్రతినిధి, దిల్లీ ఇన్‌ఛార్జి, ఆంధ్రప్రదేశ్‌ స్వర్ణకారుల సంఘం అధ్యక్షుడు కర్రి వేణుమాధవ్‌ తెలిపారు. రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య నేతృత్వంలో ఏప్రిల్‌ 3న పార్లమెంటు వద్ద ప్రదర్శన నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్‌ కాచిగూడలోని హోటల్‌లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్‌ గుజ్జ కృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చలో దిల్లీ కార్యక్రమానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి బీసీ సంఘాల నేతలు హాజరవుతారని చెప్పారు. సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి కోల జనార్దన్‌, గ్రేటర్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడు భూపేశ్‌సాగర్‌, నేత శుభప్రద్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు