logo

విద్యారంగ సమస్యలపై రాష్ట్రవ్యాప్త పర్యటన

విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తానని హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలుపొందిన ఎ.వి.ఎన్‌ రెడ్డి అన్నారు.

Published : 20 Mar 2023 02:27 IST

ఏవీఎన్‌ రెడ్డిని సత్కరించిన తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నేతలు

నారాయణగూడ, న్యూస్‌టుడే: విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తానని హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలుపొందిన ఎ.వి.ఎన్‌ రెడ్డి అన్నారు. ఈనెల 29న ప్రమాణ స్వీకారం అనంతరం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు ప్రకటించారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీపీయూఎస్‌) ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి నారాయణగూడ కేశవ స్మారక విద్యా సంస్థల సభామందిరంలో సంఘం అధ్యక్షుడు హనుమంతరావు, ప్రధాన కార్యదర్శి సురేష్‌ తదితరులు ఆయన్ని సత్కరించారు. ఈ సందర్భంగా ఏవీఎన్‌ రెడ్డి మాట్లాడుతూ.. విద్యా రంగానికి సంబంధించి అన్ని సమస్యలపై దృష్టి సారించి ప్రభుత్వాన్ని నిలదీస్తానన్నారు. తన గెలుపుకు సహకరించిన ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. సంఘం అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ.. 10వ తరగతి పరీక్షల మూల్యాంకనాల కేంద్రాలు పాత జిల్లాల్లోనే ఉన్నాయని, జిల్లాల విభజన జరిగిన నేపథ్యంలో కొత్త జిల్లాలో కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. వేతనాలు ప్రతి నెల మొదటి తేదీన చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని