logo

కిడ్నీల మార్పిడి శస్త్రచికిత్సల్లో విప్లవాత్మక మార్పులు

కిడ్నీల మార్పిడి శస్త్రచికిత్సల్లో విప్లవాత్మక మార్పులు, ఆధునిక సాంకేతిక విధానాలు అందుబాటులోకి వచ్చాయని.. వాటిపై వైద్యులు అవగాహన పెంపొందించుకోవాలని మూత్రపిండాల వైద్య నిపుణులు (నెఫ్రాలజిస్ట్‌లు) కోరారు.

Published : 20 Mar 2023 02:27 IST

సదస్సు ప్రారంభిస్తున్న జీవన్‌దాన్‌ సంస్థ డైరెక్టర్‌ స్వర్ణలత,
చిత్రంలో డా.గోపాలుని సీరాపాణి, డా.మల్లికార్జున్‌రెడ్డి తదితరులు

రాయదుర్గం: కిడ్నీల మార్పిడి శస్త్రచికిత్సల్లో విప్లవాత్మక మార్పులు, ఆధునిక సాంకేతిక విధానాలు అందుబాటులోకి వచ్చాయని.. వాటిపై వైద్యులు అవగాహన పెంపొందించుకోవాలని మూత్రపిండాల వైద్య నిపుణులు (నెఫ్రాలజిస్ట్‌లు) కోరారు. నానక్‌రాంగూడ ఫైనాన్షియల్‌ జిల్లాలోని ఓ హోటల్‌లో హైదరాబాద్‌ నెఫ్రాలజీ ఫోరం, సిటిజన్‌ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఆదివారం కిడ్నీల మార్పిడి శస్త్రచికిత్స విధానంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జీవన్‌దాన్‌ సంస్థ డైరెక్టర్‌, నిమ్స్‌ ఆసుపత్రి నెఫ్రాలజీ విభాగం వైద్యనిపుణురాలు డా.స్వర్ణలత మాట్లాడుతూ, వైద్యరంగంలో వస్తోన్న ఆధునిక సాంకేతికతపై అవగాహనకు ఇలాంటి సదస్సులు ఉపయుక్తంగా నిలుస్తాయన్నారు. సిటిజన్‌ ఆసుపత్రి వైద్యులు డా.గోపాలుని సీరాపాణి, డా.మల్లికార్జున్‌రెడ్డిలు మాట్లాడుతూ, రోగి, దాత కోలుకునే సమయాన్ని రోబోటిక్‌ శస్త్రచికిత్స పద్ధతి గణనీయంగా తగ్గిస్తోందన్నారు. డా.అనూరాధ రామన్‌, డా. గిరీశ్‌ నారాయణన్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని