TSPSC: నా భర్తపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు: హైకోర్టులో నిందితుడి భార్య పిటిషన్
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న నిందితుడి భార్య హైకోర్టులో పిటిషన్ వేశారు. తన భర్తపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారని.. వెంటనే ఆయనకు వైద్య పరీక్షలు చేయించాలని ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు.
హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC)లో పేపర్ లీకేజీ (paper Leak) కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న నిందితుడు రాజశేఖర్‌పై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారంటూ ఆయన భార్య సుచరిత ఆరోపించారు. తన భర్తకు వైద్య పరీక్షలు చేయించాలని కోరుతూ ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాజశేఖర్‌రెడ్డిని కస్టడీకి తీసుకునే ముందు వైద్య పరీక్షలు చేయించామని పోలీసు శాఖ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కస్టడీ ముగిసిన తర్వాత కోర్టులో హాజరుపరిచే ముందు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని కోర్టుకు వివరించారు. కస్టడీకి ఇచ్చే ముందు నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకే విచారణ జరుగుతుందని పేర్కొన్నారు. వాదనలు విన్న హైకోర్టు.. పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ విషయంలో ఇంకేమైనా సమస్యలుంటే నాంపల్లి కోర్టును ఆశ్రయించాల్సిందిగా పిటిషనర్‌కు ఉన్నత న్యాయస్థానం సూచించింది.
సీడీపీవో పరీక్ష కూడా రద్దు చేయాలి: ఓయూ జేఏసీ
మరోవైపు టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద ఉస్మానియా జేఏసీ ఆందోళనకు దిగింది. గ్రూప్-1 తర్వాత జరిగిన చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (సీడీపీవో) పరీక్ష కూడా రద్దు చేయాలని డిమాండ్ చేసింది. గ్రూప్-1 తర్వాత జరిగిన ఈ పరీక్షను ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించింది. సీడీపీవో పేపర్ కూడా లీకేజీ అయ్యిందని ఓయూ జేఏసీ నాయకులు అనుమానం వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్‌రెడ్డి
-
టీసీఎస్‌లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐలో శిక్షణ
-
సీ-విజిల్‌కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
-
లోక్‌సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్