logo

దామగుండం భూములను అప్పగించండి: టీఆర్‌ఆర్‌

పరిగి నియోజకవర్గంలోని పూడూరు మండలం దామగుండం శ్రీరామలింగేశ్వర స్వామికి చెందిన   44.23 ఎకరాల భూములను దేవాలయానికి అప్పగించాలని జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు టి.రామ్మోహన్ర్‌ెడ్డి కోరారు.

Published : 21 Mar 2023 01:04 IST

దేవాదాయ కమిషనర్‌కు వినతి పత్రం ఇస్తున్న రామ్మోహన్‌రెడ్డి

పరిగి, పూడూరు, న్యూస్‌టుడే: పరిగి నియోజకవర్గంలోని పూడూరు మండలం దామగుండం శ్రీరామలింగేశ్వర స్వామికి చెందిన   44.23 ఎకరాల భూములను దేవాలయానికి అప్పగించాలని జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు టి.రామ్మోహన్ర్‌ెడ్డి కోరారు. ఈమేరకు అఖిల పక్షం నాయకులు మల్లేశం, స్వామిజీ ఆధ్వర్యంలో సోమవారం దేవాదాయ శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పూడూరు మండల కేంద్రంలోని అటవీ ప్రాంతంలో పురాతన చరిత్ర కలిగిన ఆలయం ఉందని తెలిపారు. దానికి ఆనుకుని 44.23 ఎకరాల విస్తీర్ణంలో భూమి ఉందని తెలిపారు. సర్వే చేసి ఆలయ భూమిని అప్పగించాలన్నారు.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు