logo

మరమ్మతులు శూన్యం.. అడుగంటిన జలాశయం

జిల్లాలో అతిపెద్ద జలాశయాలలో జుంటిపల్లి ఒకటి. దీని రెండు తూములు దెబ్బతినడంతో ఇంకా ఎండలు ముదరక ముందే నీరు అడుగంటి రైతులను ఆందోళనకు గురిచేస్తోంది.

Updated : 21 Mar 2023 06:16 IST

నీరు తగ్గిన జుంటిపల్లి ప్రాజెక్టు

న్యూస్‌టుడే, యాలాల: జిల్లాలో అతిపెద్ద జలాశయాలలో జుంటిపల్లి ఒకటి. దీని రెండు తూములు దెబ్బతినడంతో ఇంకా ఎండలు ముదరక ముందే నీరు అడుగంటి రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. కుడి, ఎడమ కాలువల ద్వారా 2080 ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఈ ప్రాజెక్టును 1959లో నిర్మించారు. మొదట్లో పదిహేను సంవత్సరాల వరకు సాగునీరు అందించి రైతులకు అండగా నిలిచింది. తర్వాతి కాలంలో మరమ్మతులు చేపట్టక పోవడం, నిర్వహణ లోపం వంటి కారణాలతో రెండు కాలువలు పూడుకు పోయాయి. ఫలితంగా ప్రస్తుతం 300 ఎకరాలకు మించి సాగునీరు అందడలేదు.

గతంలో గుర్తు తెలియని వ్యక్తులు ఎడమ కాలువను ధ్వంసం చేయడంతో సాగు నీరంతా వృథాగా పోయింది. అధికారులు నామమాత్రంగా పనులు చేయడంతో తూము పాడై అప్పటి నుంచి ఇప్పటి వరకు నీరంతా నేలపాలవుతూనే ఉంది. ప్రస్తుతం కుడి కాలువ తూము కూడా పాడైంది. దీంతో నీరు మరింతగా పోతూ జలాశయం అడుగంటుతోంది. దీనికి అడ్డుకట్ట పడకపోతే జలాశయం ఏప్రిల్‌ మాసం చివరి నాటికి పూర్తిగా ఖాళీ అయ్యే అవకాశం లేకపోలేదు. ప్రాజెక్టు కింద వరి వేసుకున్న రైతులు చేతికి వచ్చే పంటలు అందకుండా పోతాయని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా నీటిపారుదల అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టి నీరు నిలిచే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని