logo

‘ప్రభుత్వ వైఫల్యంతోనే ప్రశ్నపత్రాల లీకేజీ’

ప్రభుత్వ వైఫల్యం కారణంగానే టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ జరిగిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు.

Published : 21 Mar 2023 02:46 IST

మాట్లాడుతున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

అంబర్‌పేట: ప్రభుత్వ వైఫల్యం కారణంగానే టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ జరిగిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో న్యాయ విచారణకు ప్రభుత్వం ఎందుకు వెనుకడుగు వేస్తోందని ప్రశ్నించారు. సోమవారం ప్రేమ్‌నగర్‌లో శక్తి కేంద్రం ప్రముఖ్‌ మైలారం రాజు, సహ ప్రముఖ్‌ ఈశ్వర్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. లీకేజీతో లక్షలాది మంది నిరుద్యోగులకు అన్యాయం జరుగుతోందన్నారు. లిక్కర్‌ కుంభకోణంలో ఎమ్మెల్సీ కవిత ప్రమేయం లేకుంటే, ఈడీ విచారణకు ఆమె ఎందుకు భయపడుతోందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. భాజపా జిల్లా అధ్యక్షుడు గౌతంరావు, నేతలు కృష్ణాగౌడ్‌, నాగభూషణంచారి, భిక్షపతి, ఆనంద్‌గౌడ్‌, యశ్వంత్‌, కృష్ణముదిరాజ్‌, నవీన్‌రెడ్డి, వెంకటస్వామిగౌడ, తిరుపతిగుప్తా పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని