logo

క్యూనెట్‌ బాధితులకు అండగా ఉంటాం: మంత్రి

క్యూనెట్‌ బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ భరోసా ఇచ్చారు.

Published : 21 Mar 2023 02:46 IST

బాధితులతో మాట్లాడుతున్న మంత్రి తలసాని

రెజిమెంటల్‌బజార్‌: క్యూనెట్‌ బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ భరోసా ఇచ్చారు. సోమవారం వెస్ట్‌మారేడ్‌పల్లిలోని మంత్రి నివాసంలో ఆయన్ను క్యూనెట్‌ బాధితులు కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఉద్యోగాల పేరిట వరంగల్‌, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్‌ జిల్లాలకు చెందిన 60 మంది వద్ద.. రూ. లక్షన్నర నుంచి రూ.3 లక్షల చొప్పున వసూలు చేసిందని వివరించారు. అగ్నిప్రమాదంలో మరణించిన ఆరుగురు సైతం తమలాగే డబ్బులు చెల్లించారని తెలిపారు. దీనిపై స్పందించిన మంత్రి.. క్యూనెట్‌ నిర్వాహకులపై చర్యలు తీసుకోవడంతోపాటు బాధితులు చెల్లించిన సొమ్మును తిరిగి ఇప్పించేలా చూస్తామని హామీ ఇచ్చారు. సంబంధిత సంస్థ నిర్వాహకులపై వెంటనే కేసు నమోదు చేయాలని మహంకాళి పోలీసులను ఆదేశించారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని త్వరలోనే మృతుల కుటుంబాలకు అందజేస్తామని ఆయన చెప్పారు.

ప్రతిపక్షాలవి అర్థంలేని ఆరోపణలు: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనలో ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీల ఆరోపణలు అర్థంలేనివని మంత్రి తలసాని అన్నారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న బాధ్యులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు