శిరస్త్రాణమే శిరోధార్యం
ద్విచక్రవాహనదారులు తప్పకుండా శిరస్త్రాణం ధరించి.. తమ ప్రాణాలను కాపాడుకోవాలని రాచకొండ సీపీ డి.ఎస్.చౌహన్ సూచించారు.
పోస్టర్ ఆవిష్కరిస్తున్న సీపీ చౌహాన్, చిత్రంలో డా.జలీల్, డా.గాయత్రి కామినేని, డా.శశిధర్, డీసీపీలు సాయిశ్రీ, శ్రీనివాస్
ఎల్బీనగర్, న్యూస్‌టుడే: ద్విచక్రవాహనదారులు తప్పకుండా శిరస్త్రాణం ధరించి.. తమ ప్రాణాలను కాపాడుకోవాలని రాచకొండ సీపీ డి.ఎస్.చౌహన్ సూచించారు. ప్రమాదంలో గాయమైనప్పుడు ప్రథమ చికిత్సతో, గుండెపోటుకు గురైన వ్యక్తిని సీపీఆర్ చేయడంతో ప్రాణాలు నిలపొచ్చని అన్నారు. ‘వరల్డ్ హెడ్ ఇంజూరీ అవేర్‌నెడ్ డే’ను పురస్కరించుకుని సోమవారం ఎల్బీనగర్‌లోని కామినేని ఆసుపత్రిలో పోలిస్ సిబ్బంది కోసం అవగాహన, శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాచకొండ సీపీ డి.ఎస్.చౌహన్ మాట్లాడుతూ.. పోలీసులు బహిరంగ ప్రదేశాల్లో పనిచేస్తూ తలకు గాయాలు, గుండెపోటు వంటి కారణాలతో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని, ఇలాంటి సమయంలో ప్రథమ చికిత్స, సీపీఆర్ చేస్తే ఫలితం ఉంటుందన్నారు. పోలీసులు వీటిపై శిక్షణ పొందాల్సిన అవసరం ఉందన్నారు. తలకు అయ్యే గాయాలు గుర్తించి తగిన విధంగా స్పందించడం ముఖ్యమన్నారు. సీపీఆర్ ఎలా చేయాలో తెలుసుకోవాలని సూచించారు. కామినేని ఆసుపత్రి సీవోవో డా. గాయత్రి కామినేని మాట్లాడుతూ..తలకు బలమైన గాయం కారణంగా దేశంలో ప్రతి 10 నిమిషాలకు ఒక మరణం సంభవిస్తుందన్నారు. సమాజంలో సభ్యులందరి భద్రత, శ్రేయస్సుకు కామినేని ముందుంటుందన్నారు. పోలీసు సిబ్బందికి అవసరమైన శిక్షణ, సీపీఆర్‌పై అవగాహన కల్పించేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. కామినేని ఆసుపత్రి ఎండీ డా.శశిధర్, ఎల్బీనగర్ డీసీపీ డి.సాయిశ్రీ, ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్, ఏసీపీలు శ్రీధర్‌రెడ్డి, పురుషోత్తంరెడ్డి పాల్గొన్నారు.
సీపీఆర్ శిక్షణలో..
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
నా భర్త కళ్లలో చెదరని నిశ్చలత చూశా
-
India News
ప్రపంచంలో ఎక్కడినుంచైనా శబరి గిరీశునికి కానుకలు
-
General News
పెళ్లికి వచ్చినా బలవంతపు తరలింపులేనా?
-
Crime News
కుటుంబంలో మద్యం చిచ్చు.. భార్యాభర్తల ఆత్మహత్య
-
Ts-top-news News
38 రోజులపాటు జోసా కౌన్సెలింగ్
-
India News
ప్రతి 5 విద్యార్థి వీసాల్లో ఒకటి భారతీయులకే.. అమెరికా రాయబారి వెల్లడి