logo

హెల్మెట్‌ ధరించి ఉంటే ప్రాణాలు నిలిచేవి

శిరస్త్రాణం ధరించండి అని పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు ఎంతగా ప్రచారం చేస్తున్నా కొందరు చెవికెక్కించుకోవడం లేదు.

Published : 21 Mar 2023 02:46 IST

ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడి ఒకరి దుర్మరణం

రమేశ్‌

హయత్‌నగర్‌: శిరస్త్రాణం ధరించండి అని పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు ఎంతగా ప్రచారం చేస్తున్నా కొందరు చెవికెక్కించుకోవడం లేదు. తమ నిర్లక్ష్యంతో ప్రాణాలు పోగొట్టుకొని.. కుటుంబాన్ని రోడ్డున పడేస్తున్నారు. అందుకు తాజా ఘటనే ఉదాహరణ.. ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడిన ఓ యువకుడి తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన ఘటన హయత్‌నగర్‌ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు...ఘట్‌కేసర్‌ పరిధి గాంధీనగర్‌కు చెందిన సంకు రమేశ్‌ (32) భార్య, ఇద్దరు కుమార్తెలతో కలిసి కొన్నాళ్లుగా సరూర్‌నగర్‌లో ఉంటున్నాడు. ఆదివారం స్వగ్రామంలో స్నేహితుడి సోదరుడి వివాహ విందుకు వెళ్లాడు. అనంతరం రాత్రి సుమారు 11 గంటల సమయంలో రమేష్‌ తన ద్విచక్ర వాహనంపై ఘట్‌కేసర్‌ నుంచి ఓఆర్‌ఆర్‌ సర్వీస్‌ రోడ్డు మీదుగా బయలుదేరాడు. రాత్రి 12.30గంటల సమయంలో గౌరెల్లి వద్దకు రాగానే అతివేగంతో అదుపుతప్పి కిందపడింది. ఈ ప్రమాదంలో రమేశ్‌ తలకు గాయాలై తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని తరలించారు. మృతుడు హెల్మెట్‌ ధరించి ఉంటే ప్రాణాలు దక్కేవని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు