logo

పక్షిని ఢీకొన్న విమానం.. తప్పిన ప్రమాదం

ఓ విమానం ల్యాండ్‌ అవుతున్న సమయంలో పక్షిని ఢీకొంది. ఈ సంఘటన శంషాబాద్‌ విమానాశ్రయంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది.

Published : 21 Mar 2023 02:46 IST

శంషాబాద్‌: ఓ విమానం ల్యాండ్‌ అవుతున్న సమయంలో పక్షిని ఢీకొంది. ఈ సంఘటన శంషాబాద్‌ విమానాశ్రయంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. త్రుటిలో ప్రమాదం తప్పడంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. విమానాశ్రయం అధికారుల వివరాల ప్రకారం.. ఇండిగో ఎయిర్‌లైన్స్‌ విమానం అహ్మదాబాద్‌ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరింది. సాయంత్రం 5.55 గంటలకు శంషాబాద్‌ విమానాశ్రయంలో దిగుతున్న సమయంలో ఓ పక్షిని ఢీకొట్టింది. పైలట్‌ అప్రమత్తమై విమానాన్ని సురక్షితంగా ల్యాండింగ్‌ చేయడంతో ప్రమాదం తప్పింది. ఆధునిక విమానాల్లో ఇంజిన్‌ లోపలి భాగంలోకి మృత కళేబరాలు చొచ్చుకెళ్లకుండా పటిష్ఠంగా ఉంటుందని.. పక్షులను ఢీకొన్నా ప్రమాదం ఉండదని ఓ అధికారి పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని