logo

బంగారం వేలంపై ఫోరం ఆగ్రహం

నోటీసు కాలపరిమితి ముగియకుండానే బంగారం వేలం వేసిన రుపీక్‌ ఫిన్‌టెక్‌ ప్రైవేటు లిమిటెడ్‌, ది ఫెడరల్‌ బ్యాంకు ప్రైవేటు లిమిటెడ్‌కు హైదరాబాద్‌ వినియోగదారుల కమిషన్‌-2 జరిమానా విధించింది.

Published : 21 Mar 2023 02:46 IST

ఈనాడు, హైదరాబాద్‌: నోటీసు కాలపరిమితి ముగియకుండానే బంగారం వేలం వేసిన రుపీక్‌ ఫిన్‌టెక్‌ ప్రైవేటు లిమిటెడ్‌, ది ఫెడరల్‌ బ్యాంకు ప్రైవేటు లిమిటెడ్‌కు హైదరాబాద్‌ వినియోగదారుల కమిషన్‌-2 జరిమానా విధించింది. రూ.1,17,302 చెల్లించడంతో పాటు రూ.40వేలు పరిహారం, రూ.10వేలు కేసు ఖర్చులు 45 రోజుల్లో చెల్లించాలని ఆదేశించింది. నిజాంపేట్‌కు చెందిన పి.వెంకట శివరామక్రిష్ణ ప్రతివాద సంస్థల సహాయంతో 24.863 తులాల బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి రూ.8,67,000 రుణం పొందారు. 2020 సెప్టెంబర్‌లో రుణం తీసుకోగా...కొవిడ్‌, ఆర్థిక ఇబ్బందులతో ఒప్పంద గడువులోగా తీర్చలేదు. దీంతో రుణం మొత్తం లేదా వడ్డీ చెల్లించి రెన్యువల్‌ చేసుకోవాలంటూ ప్రతివాద సంస్థలు ఒత్తిడి తెచ్చాయి. ఇందుకు 15 రోజుల గడువుతో నోటీసులు ఇచ్చాయి.  దీంతో ఫిర్యాదీ కొంత మొత్తం వడ్డీ చెల్లించి రెన్యువల్‌ చేయాలని కోరినా స్పందించని ప్రతివాద సంస్థ 2021 జూన్‌లో ఆభరణాలను రూ.10,21,000కు వేలం వేశారు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ ఫిర్యాదీ వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. విచారించిన కమిషన్‌.. పరిహారం, కేసు ఖర్చులు చెల్లించాలని ప్రతివాద సంస్థలను ఆదేశించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు