ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య!
ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సైదాబాద్ ఠాణా పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట పరిధి కనిమెట్టకు చెందిన పాట్ల రామస్వామి, జయమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు.
సైదాబాద్: ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సైదాబాద్ ఠాణా పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట పరిధి కనిమెట్టకు చెందిన పాట్ల రామస్వామి, జయమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు. ఐఎస్‌సదన్ డివిజన్ సింగరేణి కాలనీలోని వాంబే క్వార్టర్స్‌లో ఉంటూ ఫంక్షన్‌హాళ్లలో పనులు చేస్తుంటారు. భర్త మరణాంతరం జయమ్మ.. ముగ్గురు పిల్లలతో ఉంటోంది. పెద్దకుమారుడు శివ (19) లక్డీకాపూల్‌లోని ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి సమీపంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో పని చేసేందుకు తల్లితో పాటు ఇద్దరు తమ్ముళ్లు వెళ్లారు. ఇంట్లో శివ ఒంటరిగా ఉన్నాడు. తల్లి, కొడుకులిద్దరూ అర్ధరాత్రి ఇంటికి వచ్చి చూడగా.. శివ ఫ్యానుకు ఉరివేసుకుని విగతజీవిగా కనిపించాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ విఫలమై ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
WTC Final: భారత్ ఈ రోజు పుంజుకోకుంటే..
-
Crime News
Kakinada: ట్రాక్టర్‌ను ఢీకొట్టిన బైక్.. ముగ్గురి మృతి
-
India News
Padmini Dian: పొలం పనుల్లో మహిళా ఎమ్మెల్యే
-
Crime News
Couple Suicide: కుటుంబంలో మద్యం చిచ్చు.. భార్యాభర్తల ఆత్మహత్య
-
India News
నా భర్త కళ్లలో చెదరని నిశ్చలత చూశా
-
India News
ప్రపంచంలో ఎక్కడినుంచైనా శబరి గిరీశునికి కానుకలు