NIMS: నిమ్స్‌లో నర్సుల ధర్నా.. నిలిచిన ఎమర్జెన్సీ సర్జరీలు!

నగరంలోని నిమ్స్‌లో నర్సులు ధర్నాకు దిగారు. విధులకు సరిగా హాజరుకావడం లేదంటూ పలువురికి ఇటీవల నిమ్స్‌ డైరెక్టర్‌ బీరప్ప మెమోలు జారీ చేశారు.

Updated : 21 Mar 2023 13:45 IST

హైదరాబాద్‌: నగరంలోని నిమ్స్‌లో నర్సులు ధర్నాకు దిగారు. విధులకు సరిగా హాజరుకావడం లేదంటూ పలువురికి ఇటీవల నిమ్స్‌ డైరెక్టర్‌ బీరప్ప మెమోలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో నర్సులు విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. 

నర్సుల ఆందోళనతో ఎలెక్టివ్‌ సర్జరీలు నిలిచిపోయాయి. ఎమర్జెన్సీ సర్జరీలకు సైతం ఆటంకం ఏర్పడింది. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీతో నిమ్స్‌ డైరెక్టర్‌ బీరప్ప సమావేశమయ్యారు.  మరోవైపు త్రిసభ్య కమిటీతో చర్చలకు నర్సింగ్‌ సిబ్బంది  నిరాకరించారు. తక్షణమే మెమోలనును వెనక్కి తీసుకుంటేనే విధులకు హాజరవుతామని నర్సులు స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని