logo

రోడ్డు ప్రమాదంలో వ్యవసాయ శాస్త్రవేత్తకు తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదంలో తాండూరు వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టరు సుధాకర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. డ్రైవరుతో కలిసి ఆయన మంగళవారం హైదారాబాద్‌ నుంచి మేడ్చల్‌కు కారులో వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.

Published : 22 Mar 2023 00:36 IST

తాండూరు టౌన్‌, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో తాండూరు వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టరు సుధాకర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. డ్రైవరుతో కలిసి ఆయన మంగళవారం హైదారాబాద్‌ నుంచి మేడ్చల్‌కు కారులో వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆయన భుజానికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయన్ను స్థానికులు నగరంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. ప్రమాద విషయం తెలుసుకున్న భార్య డాక్టర్‌ సుధారాణి, ఇద్దరు పిల్లలు వెంటనే ఆస్పత్రికి వెళ్లారు. ఆయనకు ప్రాణాపాయం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని