logo

రాష్ట్రపతి నిలయం.. అభివృద్ధికి శ్రీకారం

బొల్లారంలోని రాష్ట్రపతి నిలయాన్ని ఏడాది పొడవునా తిలకించేలా చేస్తున్న ఏర్పాట్లు, పలు అభివృద్ధి పనులకు బుధవారం శ్రీకారం చుట్టనున్నారు.

Published : 22 Mar 2023 01:53 IST

బొల్లారం, కంటోన్మెంట్‌, న్యూస్‌టుడే: బొల్లారంలోని రాష్ట్రపతి నిలయాన్ని ఏడాది పొడవునా తిలకించేలా చేస్తున్న ఏర్పాట్లు, పలు అభివృద్ధి పనులకు బుధవారం శ్రీకారం చుట్టనున్నారు. దిల్లీ నుంచి వర్చువల్‌ విధానంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయా ఏర్పాట్లతోపాటు మరమ్మతులు చేసిన సొరంగం, ఆర్ట్‌ గ్యాలరీని ప్రారంభిస్తారు. మరిన్ని వనాల అభివృద్ధికి శంకుస్థాపన చేయనున్నారు. గవర్నర్‌ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు ప్రత్యక్షంగా పాల్గొననున్నారు. ఉదయం 11గంటలకు నిలయంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. గురువారం నుంచి సాధారణ పౌరులకు నిలయాన్ని సందర్శించే అవకాశం కల్పించనున్నారు. ఇప్పటికే ఆన్‌లైన్లో పలువురు టిక్కెట్లు కొనుగోలు చేశారు. చిన్నారులకు ప్రవేశం ఉచితం.

* 2009లో అప్పటి రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌ నిలయంలో ఔషధవనాన్ని పెంచి 2010 శీతాకాల విడిదిలో ప్రారంభించారు. 2011 జనవరి 1 నుంచి నిలయం చరిత్రను తెలుసుకునేలా కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. అప్పటివరకు ఉన్న నిషిద్ధ నిబంధనలను రద్దు చేసి ప్రజల సందర్శనకు అనుమతించేలా ఆదేశించారు.
* ప్రత్యేక గైడులు: సందర్శకులకు నిలయం పరిసరాలు చూపేలా గైడులను ఏర్పాటు చేశారు. వ్యాపార సముదాయాలను కాంట్రాక్టు పద్ధతిలో నిర్వహించనున్నారు.


ప్రతి 10 నిమిషాలకో బస్సు

ఈనాడు, హైదరాబాద్‌: బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి సిటీ బస్సులను 187 ట్రిప్పులు నడుపుతున్నట్టు ఆర్టీసీ సికింద్రాబాద్‌ రీజియన్‌ మేనేజర్‌ సీహెచ్‌.వెంకన్న తెలిపారు. బొల్లారం మార్గంలో నడిచే బస్సులన్నీ రాష్ట్రపతి నిలయం వద్ద ఆగి వెళ్లేలా ఏర్పాట్లు చేసింది. ప్రతి 5 నుంచి 10 నిమిషాల వ్యవధిలో రాష్ట్రపతి నిలయానికి బస్సులు నడుస్తాయి.
* 24బి: సికింద్రాబాద్‌- బాలాజీనగర్‌ మధ్య నడిచే బస్సులు..
* 211ఎం: సికింద్రాబాద్‌ - సీఆర్‌పీఎఫ్‌ మధ్య బస్సులు..
* 24బి/281: సికింద్రాబాద్‌ - ఘట్‌కేసర్‌ మధ్య నడిచే  బస్సులన్నీ  రాష్ట్రపతి నిలయం వద్ద ఆగుతాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు