logo

నకిలీ సర్టిఫికెట్ల దందా.. నలుగురి అరెస్టు

నకిలీ సర్టిఫికెట్లు విక్రయిస్తున్న  నిందితుడిని రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి కేసులోనే గతంలో జైలుకెళ్లొచ్చిన ఇతడు తిరిగి నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు.

Published : 22 Mar 2023 01:53 IST

పోలీసుల అదుపులో ఉన్న నిందితులు

జవహర్‌నగర్‌, న్యూస్‌టుడే: నకిలీ సర్టిఫికెట్లు విక్రయిస్తున్న  నిందితుడిని రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి కేసులోనే గతంలో జైలుకెళ్లొచ్చిన ఇతడు తిరిగి నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు.  మల్కాజిగిరి ఎస్‌ఓటీ ఇన్‌స్పెక్టర్‌ రాములు తెలిపిన వివరాల ప్రకారం....జవహర్‌నగర్‌ బాలాజీనగర్‌కు చెందిన మాజీ సైనికోద్యోగి బుర్ల శంకర్‌రావు (50), లిటిల్‌రోజ్‌ గ్రామర్‌ పాఠశాల ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నాడు. గతంలోను నకిలీ ధ్రువపత్రాలను విక్రయించిన కేసులో జైలుకెళ్లొచ్చాడు. సమాచారం అందుకున్న ఎస్‌ఓటీ పోలీసులు దాడులు నిర్వహించి మూడు విశ్వవిద్యాలయాలకు చెందిన 25 ధ్రువపత్రాలను  స్వాధీనం చేసుకున్నారు.  జవహర్‌నగర్‌కు చెందిన భానుచందర్‌రెడ్డి (35), మౌలాలి వాసి తిరుపతి శ్రావణ్‌కుమార్‌ (26), కూకట్‌పల్లిలో ఉండే దాయక సాయి (24) ఈ సర్టిఫికెట్లను కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఇంకా ఎంత మందికి విక్రయించాడనే కోణంలో విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని