logo

పనులకు పచ్చజెండా

మూడు నెలల విరామం అనంతరం మొదలైన స్థాయీ సంఘం సమావేశంలో.. పదుల కొద్దీ అభివృద్ధి పనుల ప్రతిపాదనలు ఆమోదం పొందాయి.

Published : 22 Mar 2023 02:10 IST

సమావేశంలో మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, కమిషనర్‌ లోకేష్‌కుమార్‌, ఇతర అధికారులు

ఈనాడు, హైదరాబాద్‌: మూడు నెలల విరామం అనంతరం మొదలైన స్థాయీ సంఘం సమావేశంలో.. పదుల కొద్దీ అభివృద్ధి పనుల ప్రతిపాదనలు ఆమోదం పొందాయి. నగర మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి అధ్యక్షతన మంగళవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో మొత్తం 23 తీర్మానాలకు ఆమోదం లభించింది. అందులో మెజార్టీ రోడ్డు విస్తరణ పనులే. రహదారి అభివృద్ధి ప్రణాళిక(ఆర్డీపీ)లో భాగంగా, మాస్టర్‌ ప్లాన్‌కు తగ్గట్లుగా రోడ్లను విస్తరించే పలు తీర్మానాలకు సభ్యులు ఆమోదం తెలిపారు. భారీ భూసేకరణకు పచ్చజెండా ఊపారు. కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద విభాగినిలపై పచ్చదనం నిర్వహణ, చెరువుల సుందరీకరణకు సంస్థలు ముందుకు రాగా.. ఒప్పందాలకు స్థాయీ సంఘం అనుమతి ఇచ్చింది. సమావేశంలో స్థాయీ సంఘం సభ్యులు, కమిషనర్‌ డి.ఎస్‌.లోకేష్‌ కుమార్‌, ఈఎన్‌సీ జియాఉద్దీన్‌, సీఈ దేవానంద్‌, అదనపు కమిషనర్లు ప్రియాంక, వి.కృష్ణ, జయరాజ్‌ కెనడి, విజయలక్ష్మి, సరోజ, ఓ.ఎస్‌.డి సురేష్‌కుమార్‌, సీసీపీ దేవేందర్‌ రెడ్డి, అడిషనల్‌ సీసీపీ శ్రీనివాస్‌, జోనల్‌ కమిషనర్లు మమత, రవికిరణ్‌, పంకజ, శంకరయ్య, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.  

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని