logo

పోలీసుల అదుపులో తీన్మార్‌ మల్లన్న

పీర్జాదిగూడలోని క్యూన్యూస్‌ నిర్వాహకులు తీన్మార్‌ మల్లన్న, సుదర్శన్‌, విఠల్‌ను రాచకొండ పోలీసులు మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు

Published : 22 Mar 2023 02:10 IST

ఈనాడు, హైదరాబాద్‌: పీర్జాదిగూడలోని క్యూన్యూస్‌ నిర్వాహకులు తీన్మార్‌ మల్లన్న, సుదర్శన్‌, విఠల్‌ను రాచకొండ పోలీసులు మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు.కారణాలను మాత్రం వెల్లడించలేదు. ఆయనతోపాటు విఠల్‌ను, సుదర్శన్‌ను ఆయన ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్నారు. కార్యాలయంలోని కొన్ని హార్డ్‌డిస్కులను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక జర్నలిస్టులు స్పందించి మేడిపల్లి పోలీస్‌ స్టేషన్‌ వరకు ర్యాలీగా వెళ్లారు. మల్లన్నకు మద్దతుగా నినాదాలు చేశారు. పీర్జాదిగూడ దగ్గర వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో క్యూన్యూస్‌కు చెందిన కొందరు విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని కర్రలతో బెదిరించి, వాళ్లని బలవంతంగా క్యూన్యూస్‌ కార్యాలయంలోకి తీసుకెళ్లినట్లు ఘట్కేసర్‌ పోలీసులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. గదికి తాళం వేసి, ఫోన్లు, ఐడీ కార్డులు లాక్కున్నట్లు పేర్కొన్నారు. పోలీసులని తెలిసినా దుర్భాషలాడుతూ దురుసుగా ప్రవర్తించారన్నారు. సమాచారం అందగానే ఘట్కేసర్‌ పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి వారిని రక్షించినట్లు తెలిపారు. అక్కడి సిబ్బందిని అదుపులోకి తీసుకున్నామని, వ్యవహారంపై దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని