logo

అన్ని రంగాల్లో హైదరాబాద్‌ అభివృద్ధి ఘనత మాదే

ప్రభుత్వంపై విమర్శలు చేయడమే ప్రతిపక్ష పార్టీలు పనిగా పెట్టుకున్నాయని వాటిని సమర్థంగా పార్టీ శ్రేణులు ఎదుర్కొవాలని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ సూచించారు.

Published : 22 Mar 2023 02:10 IST

భారాస జిల్లా ఆత్మీయ సమావేశంలో మంత్రి  

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, వేదికపై దానం నాగేందర్‌, దాసోజు శ్రవణ్‌, మహమూద్‌ అలీ,  గద్వాల్‌ విజయలక్ష్మీ తదితరులు

ఫిలింనగర్‌, న్యూస్‌టుడే: ప్రభుత్వంపై విమర్శలు చేయడమే ప్రతిపక్ష పార్టీలు పనిగా పెట్టుకున్నాయని వాటిని సమర్థంగా పార్టీ శ్రేణులు ఎదుర్కొవాలని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ సూచించారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ భవన్‌లో మంగళవారం జరిగిన హైదరాబాద్‌ జిల్లా భారాస ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్‌ అలీ మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో భారాస విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ బలమని, కార్యకర్తలే బలగమని ఎమ్మెల్యే దానం నాగేందర్‌ పేర్కొన్నారు. మేయర్‌ విజయలక్ష్మి మాట్లాడుతూ.. గ్రూపు రాజకీయాలకు తావులేకుండా ప్రతి కార్యకర్తకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఇతర పార్టీల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికి సోషల్‌ మీడియా అకౌంట్లు తెరవాలని పార్టీ శ్రేణులకు భారాస హైదరాబాద్‌ జిల్లా ఇన్‌ఛార్జ్‌ దాసోజు శ్రవన్‌ సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌, డిప్యూటీ మేయర్‌ శ్రీలతరెడ్డి, వివిధ కార్పొరేషన్‌ ఛైర్మన్లు రావుల శ్రీధర్‌రెడ్డి, విప్లవ్‌కుమార్‌, సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ భారాస ఇన్‌ఛార్జి తలసాని సాయి కిరణ్‌యాదవ్‌, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, వివిధ నియోజకవర్గాల పార్టీ ఇన్‌ఛార్జ్‌లు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్‌ అధ్యక్షులు పాల్గొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని