KTR vs Bandi sanjay: ఉగాది వేళ.. కేటీఆర్‌, బండి సంజయ్‌ పొలిటికల్‌ పంచాంగం చూశారా!

భారాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఎవరికి వారు తమదైన శైలిలో రాజకీయ ఉగాది పంచాంగం చెప్పుకొచ్చారు. పరస్పరం రాజకీయ విమర్శలతో సాగిన వీరిద్దరి పంచాంగం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Updated : 23 Mar 2023 07:15 IST

హైదరాబాద్‌: ఉగాది పండుగ వేళ భాజపా, భారాస మధ్య ట్విటర్‌ వేదికగా మాటల యుద్ధం కొనసాగింది. భారాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఎవరికి వారు తమదైన శైలిలో రాజకీయ ఉగాది పంచాంగం చెప్పుకొచ్చారు. పరస్పరం రాజకీయ విమర్శలతో సాగిన వీరిద్దరి పంచాంగం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కవిత ఈడీ విచారణ, టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం రాజకీయ వర్గాల్లో కాక రేపుతున్న సమయంలో.. తాజాగా ఉగాది పంచాంగం రాజకీయవేడిని మరింత పెంచింది. 

మంత్రి కేటీఆర్‌ చెప్పిన పంచాంగం ఇలా..

ఉగాది వేళ ఐటీశాఖా మంత్రి కేటీఆర్ వినూత్నంగా ట్వీట్ చేశారు. ‘‘ఆదాయం: అదానీకి, వ్యయం: జనానికి, బ్యాంకులకు. అవమానం: నెహ్రూకి, రాజపూజ్యం: గుజరాతీ గుంపుకి.  బస్, బభ్రాజీమానం భజగోవిందం! దేశీయ ఉగాది పంచాంగం సమాప్తం!’’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు.

బండి సంజయ్‌ ట్వీట్‌ ..

‘‘ఆదాయం: కల్వకుంట్ల కుటుంబానికి. వ్యయం:  తెలంగాణ రాష్ట్రానికి. అవమానం: ఉద్యమ వీరులకు, అమరుల త్యాగాలకు. రాజ పూజ్యం: ఉద్యమ ద్రోహులకు, దొంగలకు. తుస్‌.. పిట్టల దొర, తుపాకీ చంద్రుల గడీల పంచాయితీ లెక్క తేలుడే తరువాయి. పతనం ఇక షురువాయే!!’’ అని ట్వీట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు