logo

లక్ష్యం రూ.480 కోట్లు

ఆర్థిక సంవత్సరం ముగుస్తుండటంతో జీహెచ్‌ఎంసీ అధికారులు ఆస్తిపన్ను బకాయిలపై దృష్టి సారించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.2వేల కోట్ల పన్ను వసూలు చేయాలని గతేడాది బల్దియా నిర్ణయించుకుంది.

Published : 23 Mar 2023 01:55 IST

పన్ను బకాయిల వసూళ్లపై జీహెచ్‌ఎంసీ గురి

ఈనాడు, హైదరాబాద్‌: ఆర్థిక సంవత్సరం ముగుస్తుండటంతో జీహెచ్‌ఎంసీ అధికారులు ఆస్తిపన్ను బకాయిలపై దృష్టి సారించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.2వేల కోట్ల పన్ను వసూలు చేయాలని గతేడాది బల్దియా నిర్ణయించుకుంది. బుధవారం నాటికి రూ.1520కోట్లు వసూలవడంతో.. మిగిలిన రూ.480కోట్లను మార్చి నెలాఖరు నాటికి ఖజానాకు చేర్చాలని కమిషనర్‌ డి.ఎస్‌.లోకేష్‌కుమార్‌ అధికారులందరినీ అప్రమత్తం చేశారు. క్షేత్రస్థాయిలో బిల్‌ కలెక్టర్లు, ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్లు ఉదయం 8గంటల నుంచే విధుల్లో ఉండేట్లు, ఆస్తి పన్ను వసూళ్లపై డిప్యూటీ కమిషనర్లు, జోనల్‌ కమిషనర్లు నిరంతరం సమీక్ష చేపట్టాలని స్పష్టం చేశారు. లక్ష్యం చేరుకోని అధికారులపై చర్యలుంటాయని హెచ్చరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు