logo

బంగారం కొనిచ్చినా.. ఖాళీ చెక్కులడిగింది

రైలు కిందపడి ఆత్మహత్య చేసుకునేందుకు వెళ్తున్న ఓ ప్రైవేట్‌ లెక్చరర్‌ను సికింద్రాబాద్‌ జీఆర్పీ పోలీసులు కాపాడారు. జీఆర్పీ ఇన్‌స్పెక్టర్‌ శ్రీను కథనం ప్రకారం..

Updated : 23 Mar 2023 13:27 IST

మహిళతో వివాహేతర సంబంధం.. యువకుడి ఆత్మహత్యాయత్నం

రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే: రైలు కిందపడి ఆత్మహత్య చేసుకునేందుకు వెళ్తున్న ఓ ప్రైవేట్‌ లెక్చరర్‌ను సికింద్రాబాద్‌ జీఆర్పీ పోలీసులు కాపాడారు. జీఆర్పీ ఇన్‌స్పెక్టర్‌ శ్రీను కథనం ప్రకారం.. మచిలీపట్నం యువకుడు (28) నగరంలో ప్రైవేట్‌ లెక్చరర్‌. భర్తతో విడిపోయి ఇద్దరు పిల్లలున్న మహిళతో ఇతడికి వివాహేతర సంబంధం ఏర్పడింది. కొద్దిరోజులుగా ఆమె హైదరాబాద్‌కు వచ్చి వెళ్తుంది. వారం క్రితం నగరానికి వచ్చి అతడితో కలిసి ఓ హోటల్‌లో ఉంది. ఈ మధ్యనే ఆమెకు రూ.లక్షన్నర బంగారం కొనిచ్చాడు. సంతృప్తి పడని ఆమె 3 ఖాళీ చెక్కులను ఇవ్వాలని కోరింది. అతడు అంగీకరించకపోవడంతో ఇద్దరి మధ్య బుధవారం ఉదయం గొడవ జరిగింది. దీంతో ఆమె తిరిగి సొంతూరుకు వెళ్లిపోతానని సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు వచ్చింది. అతడు కూడా స్టేషన్‌కు రాగా ఇద్దరూ గొడవ పడ్డారు. మనస్తాపానికి గురైన ఆ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంటానని వెళ్తుండగా జీఆర్పీ హెడ్‌కానిస్టేబుల్‌ మునీశ్వర్‌ గుర్తించి అడ్డుకున్నాడు. వారిని పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లాడు. ఇన్‌స్పెక్టర్‌ శ్రీను, సిబ్బంది ఆ ఇద్దరికి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఆమె సొంతూరుకు రైల్లో వెళ్లిపోగా, పోలీసుస్టేషన్‌కు వచ్చిన స్నేహితుడికి లెక్చరర్‌ను అప్పగించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు