logo

తక్షణం స్పందించేలా.. నలుగురిని రక్షించేలా

అగ్నిప్రమాదాలు జరిగితే వెంటనే అప్రమత్తమవ్వాలని అగ్నిమాపకశాఖ అధికారులు సూచిస్తున్నారు. ఈమేరకు వట్టి నాగులపల్లిలోని శిక్షణ కేంద్రంలో భౌతిక, అవగాహన శిక్షణ ఇస్తున్నారు.

Published : 23 Mar 2023 01:55 IST

ఈనాడు, హైదరాబాద్‌: అగ్నిప్రమాదాలు జరిగితే వెంటనే అప్రమత్తమవ్వాలని అగ్నిమాపకశాఖ అధికారులు సూచిస్తున్నారు. ఈమేరకు వట్టి నాగులపల్లిలోని శిక్షణ కేంద్రంలో భౌతిక, అవగాహన శిక్షణ ఇస్తున్నారు.

* ఫస్ట్‌ ఎయిడ్‌ ఫైర్‌ ఫైటింగ్‌ ట్రైనింగ్‌ కోర్సు: ఒకరోజు కోర్సులో భాగంగా ఫైర్‌ ఫైటింగ్‌ ఎక్స్‌టింగ్విషర్ల వినియోగం, మంటలకు కారణాలు, పొగ దుష్ప్రభావాలు వివరిస్తారు. స్ప్రింక్లర్‌ వ్యవస్థ, ఫోమ్‌, కార్బన్‌ డయాక్సైడ్‌, ఫైర్‌ పంపులు, ఫైర్‌ అలారమ్‌ గుర్తించడం, మాక్‌డ్రిల్‌ ద్వారా వివరిస్తారు.

* బేసిక్‌ ఫైర్‌ ప్రివెన్షన్‌ అండ్‌ ఫస్ట్‌ ఎయిడ్‌ ఫైర్‌ ఫైటింగ్‌: 3 రోజుల శిక్షణలో పైకోర్సులతోపాటు పంపింగ్‌ నిర్వహణ, వినియోగం, అగ్నిప్రమాదంలో భవనం పరిస్థితి, పరిశ్రమల్లో అగ్నిప్రమాదాలు, మంటల తీవ్రతను గుర్తించడం, ఫైర్‌ పరికరాలు లేకుండా రెస్క్యూ పద్ధతులు తెలుపుతారు.

* ఎలిమెంటరీ ఫైర్‌ ఫైటింగ్‌ ట్రైనింగ్‌ కోర్సు: 6 రోజుల శిక్షణలో పై కోర్సులతోపాటు నేషనల్‌ బిల్డింగ్‌ కోడ్‌-2016, ఫిక్స్‌డ్‌ ఫైర్‌ ఫైటింగ్‌ ఇన్‌స్టాలేషన్‌, బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్‌, ఫోమ్‌ ఎక్విప్‌మెంట్‌పై శిక్షణ ఇస్తారు.

* ఫైర్‌ ప్రివెన్షన్‌ అండ్‌ ఫస్ట్‌ ఎయిడ్‌ ఫైర్‌ ఫైటింగ్‌ ఓరియంటేషన్‌: 12 రోజుల శిక్షణలో పైకోర్సులతోపాటు రోప్స్‌, లైన్స్‌, హోస్‌డ్రిల్‌, ల్యాడర్‌డ్రిల్‌, పికప్‌డ్రిల్‌పై అవగాహన కల్పిస్తారు.

* బేసిక్‌ ఫైర్‌ ఫైటర్‌: నెలరోజుల శిక్షణ కోర్సు. ఫైర్‌ ఆడిట్‌ బిల్డింగ్‌, ఫైర్‌, లైఫ్‌ సేఫ్టీ వ్యవస్థలపై అవగాహన, భవన నిర్మాణాల్లో ఫైర్‌ సేఫ్టీ, ప్రాథమిక చికిత్స, పేలుడు పదార్థాలు, విపత్తు నిర్వహణ, పరిశ్రమల్లో రసాయన, గ్యాస్‌, ఆయిల్‌ మంటల నివారణపై అవగాహన కల్పిస్తారు.

* ప్రైవేటు సంస్థల్లో ఫైర్‌ సూపర్‌వైజర్‌ 3 నెలల శిక్షణలో పైకోర్సుల్లో భాగంగా ఫైర్‌ ఆడిట్‌ బిల్డింగ్‌, ఫైర్‌, లైఫ్‌ సేఫ్టీ వ్యవస్థలపై అవగాహన, భవన నిర్మాణాల్లో ఫైర్‌ సేఫ్టీ, ప్రాక్టికల్‌ ఫైర్‌మెన్‌షిప్‌, హైడ్రాలిక్స్‌, విపత్తు నిర్వహణ, తెలంగాణ ఫైర్‌ సర్వీసెస్‌ చట్టం నిబంధనలు, ప్రాథమిక చికిత్సలపై అవగాహన కల్పిస్తారు. కోర్సులు, బస, మెస్‌ ఛార్జీల వివరాలకు  వెబ్‌సైట్‌.. https://fire.telangana.gov.in/WebSite/training.aspx

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని