logo

లాడ్జిలో ఉరేసుకొని సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య

ఉరి వేసుకొని ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్నాడు. గోపాలపురం ఎస్సై శివశంకర్‌ కథనం ప్రకారం..

Published : 23 Mar 2023 01:55 IST

రెజిమెంటల్‌ బజార్‌, న్యూస్‌టుడే: ఉరి వేసుకొని ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్నాడు. గోపాలపురం ఎస్సై శివశంకర్‌ కథనం ప్రకారం.. మీర్‌పేట్‌ గాయత్రినగర్‌లో ఉంటున్న పానుగంటి వెంకటేశ్వర్లు ప్రమీలకు ఇద్దరు కుమారులు. వెంకటేశ్వర్లు బీడీఎల్‌ ఉద్యోగి కాగా భార్య గృహిణి. వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు విశాల్‌ కుమార్‌(27) హైటెక్‌ సిటీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. రోజు మాదిరిగానే ఈనెల 21న ఉదయం ఆఫీస్‌కు వెళ్తున్నట్లు చెప్పి ఇంటి నుంచి బయల్దేరి వచ్చాడు. 11 గంటల సమయంలో తల్లి ఫోన్‌ చేయగా ఆఫీసులో ఉన్నానని చెప్పాడు. అక్కడినుంచి నేరుగా సికింద్రాబాద్‌కు వచ్చి అదేరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు రెజిమెంటల్‌బజార్‌లోని లాడ్జిలో దిగాడు. రాత్రి 9 గంటలకు ఇంటికి రాకపోవడంతో తల్లి ఫోన్‌ చేయగా స్పందించలేదు. ఉదయం వరకు సమాధానం రాకపోవడంతో బుధవారం ఉదయం తండ్రి మీర్‌పేట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫోన్‌ లొకేషన్‌ ఆధారంగా సికింద్రాబాద్‌లోని లాడ్జిలో ఉన్నట్లు మధ్యాహ్నం 12.40 గంటలకు గుర్తించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని