logo

యువతితో ఓలా డ్రైవర్‌ అసభ్య ప్రవర్తన

యువతి(26)తో అసభ్యంగా ప్రవర్తించిన ఓలా బైక్‌ టాక్సీ డ్రైవర్‌పై జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్‌ పోలీసుల కథనం ప్రకారం.. మనికొండకు చెందిన ఒక యువతి ఓలా బైక్‌ టాక్సీ బుక్‌ చేసుకుంది.

Published : 23 Mar 2023 01:55 IST

జూబ్లీహిల్స్‌: యువతి(26)తో అసభ్యంగా ప్రవర్తించిన ఓలా బైక్‌ టాక్సీ డ్రైవర్‌పై జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్‌ పోలీసుల కథనం ప్రకారం.. మనికొండకు చెందిన ఒక యువతి ఓలా బైక్‌ టాక్సీ బుక్‌ చేసుకుంది. మణికొండలో ప్రారంభమైన యువతి.. బైక్‌ టాక్సీపై జూబ్లీహిల్స్‌లోని మెఫిల్‌ కూడలి చేరుకుంది. ఈ క్రమంలోనే బైక్‌ టాక్సీ నడుపుతున్న వ్యక్తి.. యువతితో అసభ్యంగా ప్రవర్తించాడు. యువతి గట్టిగా అరిచి వాహనాన్ని నిలపాలని సూచించింది. యువతిని దించి అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయాడు. యువతి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్‌ పోలీసులు బైక్‌ టాక్సీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని