logo

ఎమ్మెల్సీ కవితపై అభ్యంతరకర పోస్టులు.. ఒకరి అరెస్టు

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫొటోలను మార్ఫింగ్‌ చేసి యూట్యూబ్‌లో అసభ్య పోస్టులు పెట్టిన ఓ వ్యక్తిని గచ్చిబౌలి పోలీసులు అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు.

Published : 23 Mar 2023 01:55 IST

గచ్చిబౌలి, న్యూస్‌టుడే: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫొటోలను మార్ఫింగ్‌ చేసి యూట్యూబ్‌లో అసభ్య పోస్టులు పెట్టిన ఓ వ్యక్తిని గచ్చిబౌలి పోలీసులు అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు. డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ రవీందర్‌ వివరాల ప్రకారం.. దిల్లీ లిక్కర్‌ స్కామ్‌ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవితపై ఓ వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెడుతున్నాడని అతనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా భారాస స్థానిక నేతలు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సంబంధిత పోస్టులు పెట్టింది కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామానికి చెందిన ప్రైవేటు ఉద్యోగి బొల్లి చంద్రశేఖర్‌(25)గా గుర్తించారు. కవిత ఫొటోలను మార్ఫింగ్‌ చేసి వీడియోలు రూపొందించడమే కాకుండా, అసభ్యకర పదాలను వాడి వాటిని య్యూటూట్‌లో అప్‌లోడ్‌ చేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని