logo

మిలటరీ ఆసుపత్రిలో దవడ ఎముక రీప్లేస్‌మెంట్‌

తిరుమలగిరిలోని మిలిటరీ ఆసుపత్రిలో బుధవారం అరుదైన దవడ ఎముక రీప్లేస్‌మెంట్‌ శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించినట్లు రక్షణ పౌర సంబంధాల అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు.

Published : 23 Mar 2023 01:55 IST

కంటోన్మెంట్‌, న్యూస్‌టుడే: తిరుమలగిరిలోని మిలిటరీ ఆసుపత్రిలో బుధవారం అరుదైన దవడ ఎముక రీప్లేస్‌మెంట్‌ శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించినట్లు రక్షణ పౌర సంబంధాల అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. లెఫ్టినెంట్‌ కల్నల్‌ వినయ్‌సింగ్‌ పరిహార్‌ నేతృత్వంలోని బొల్లారం మిలిటరీ డెంటల్‌ సెంటర్‌, ఆర్మీ కాలేజ్‌ ఆఫ్‌ డెంటల్‌ సైన్సెస్‌ వైద్యుల బృందం ఈ శస్త్రచికిత్సను నిర్వహించినట్లు తెలిపారు. హనుమకొండ జిల్లాకు చెందిన ఓ మహిళ(50)కు బ్లాక్‌ ఫంగస్‌ కారణంగా పై దవడ ఎడమ భాగం పూర్తిగా పాడవ్వడంతో ఆ భాగాన్ని తొలగించిన వైద్య బృందం 3డీ ప్రింటింగ్‌ సాంకేతికత ద్వారా తయారు చేసిన టైటానియం దవడను ఏర్పాటు చేసినట్లు వివరించారు. అడ్వాన్స్డ్‌ర్యాపిడ్‌ ప్రోటోటైపింగ్‌ టెక్నిక్‌ అండ్‌ పారస్‌ విధానం ద్వారా ఇలాంటి శస్త్రచికిత్సలు చేస్తున్న అతితక్కువ వైద్య బృందాల్లో మిలిటరీ ఆసుపత్రి వైద్య బృందం ఒక్కటని అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని