logo

దుమ్ము కాలుష్యం.. అవస్థలు వర్ణనాతీతం

తాండూరు మండలం కరణ్‌కోటలోని సిమెంటు కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) కర్మాగారం నుంచి విపరీతమైన దుమ్ము వెలువడుతోంది. దీంతో పరిసరాల్లోని చెట్లు రంగు మారాయి.

Published : 23 Mar 2023 02:29 IST

తాండూరు గ్రామీణ, న్యూస్‌టుడే: తాండూరు మండలం కరణ్‌కోటలోని సిమెంటు కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) కర్మాగారం నుంచి విపరీతమైన దుమ్ము వెలువడుతోంది. దీంతో పరిసరాల్లోని చెట్లు రంగు మారాయి. వడ్డెరబస్తీ, మోమిన్‌గల్లీ, ముదిరాజ్‌ కాలనీ, ఎస్సీ కాలనీ, గౌడ్స్‌ కాలనీల్లో గ్రామస్థులు కాలుష్యంతో వ్యాధుల బారినపడుతున్నట్లు వాపోయారు. చర్మ, పంటి సమస్యలు, వెంట్రుకలు రంగు మారడం, శ్వాసకోశ, కంటి సంబంధిత వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు.  

రూ.కోట్లు ఖర్చు చేసినా..

సుమారు 40 సంవత్సరాల క్రితం నెలకొల్పిన ఈ కర్మాగారంలో యంత్రాలు కాలం చెల్లాయి. ఆధునికీకరణ పేరిట రెండు సంవత్సరాల క్రితం దిల్లీలోని యాజమాన్యం రూ.50కోట్లు మంజూరు చేసింది. ఇకపై దుమ్ము కాలుష్యం రాకుండా ఆధునాతన యంత్రాలు అమర్చుతున్నట్లు కర్మాగార ప్రతినిధులు ప్రకటించారు. మరమ్మతులు పూర్తయి ఏడాదిన్నర గడుస్తోంది. కాలుష్య సమస్య మొదటికొచ్చింది. రూ.కోట్లు ఖర్చు చేసినా ఉపయోగం లేకుండా పోయిందని గ్రామస్థులు వాపోతున్నారు. ప్రభుత్వ అధికారులు, కంపెనీ నిర్వాహకులు ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని