logo

‘డిజిటల్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌’లో కలిసి పనిచేయాలి

క్రొయేషియా మాజీ అధ్యక్షురాలు కోలిందా గ్రాబర్‌ కిటారోవిక్‌ బుధవారం ఐఎస్‌బీ(ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌)ను సందర్శించారు. ఈ సందర్భంగా ఐఎస్‌బీ డీన్‌ మదన్‌ పిల్లుట్ల..

Updated : 23 Mar 2023 06:50 IST

క్రొయేషియా మాజీ అధ్యక్షురాలు కోలిందా గ్రాబర్‌ కిటారోవిక్‌

ఎంవోయూ పత్రాలతో డా.మాటో ఇంజావ్రో, మదన్‌ పిల్లుట్ల. చిత్రంలో కోలిందా గ్రాబర్‌ కిటారోవిక్‌

రాయదుర్గం, న్యూస్‌టుడే: క్రొయేషియా మాజీ అధ్యక్షురాలు కోలిందా గ్రాబర్‌ కిటారోవిక్‌ బుధవారం ఐఎస్‌బీ(ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌)ను సందర్శించారు. ఈ సందర్భంగా ఐఎస్‌బీ డీన్‌ మదన్‌ పిల్లుట్ల.. తమ విద్యాసంస్థ అందిస్తున్న వ్యాపార, మేనేజ్‌మెంట్‌ కోర్సులు, చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. అనంతరం కోలిందా గ్రాబర్‌ కిటారోవిక్‌, క్రొయేషియాలో భారత రాయబారి రాజ్‌ వాస్తవల సమక్షంలో క్రొయేషియా జాగ్రెబ్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌, ఐఎస్‌బీలు విద్యార్థుల మార్పిడికి వీలుగా ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఆనక ఎంవోయూ పత్రాలపై మదన్‌ పిల్లుట్ల, ‘జాగ్రెబ్‌ స్కూల్‌’ డీన్‌ డా.మాటో ఇంజావ్రో సంతకాలు చేసి మార్చుకున్నారు. ఈ ఒప్పందంలో భాగంగా ఆయా విద్యాసంస్థలు ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించడంతోపాటు పరస్పర విద్యార్థుల మార్పిడి, రెండు దేశాల్లో విద్యాభ్యాసం జరిగేలా చూస్తాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కోలిందా గ్రాబర్‌ కిటారోవిక్‌ విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ, డిజిటల్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌, హరితవృద్ధి రంగాల్లో భారత్‌, క్రొయేషియాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. పుడమి ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో వాతావరణమార్పు ఒకటని.. ఈ భూగోళం సహా పిల్లల భవిష్యత్తును జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని అన్నారు. మదన్‌ పిల్లుట్ల మాట్లాడుతూ, తమ విద్యార్థి మార్పిడి నెట్‌వర్క్‌లో క్రొయేషియానూ చేర్చుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని