logo

బ్రహ్మానందం గొప్ప నటుడు: మంత్రి తలసాని

దాదాపు 1250 చిత్రాల్లో నటించిన గొప్ప నటుడు బ్రహ్మానందం అని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు.

Published : 23 Mar 2023 02:29 IST

బ్రహ్మానందంను సన్మానిస్తున్న ఎఫ్‌ఎంసీసీ అధ్యక్షుడు జి.ఆదిశేషగిరిరావు, కార్యదర్శి ముళ్లపూడి మోహన్‌, మంత్రి తలసాని, దర్శకుడు త్రివిక్రమ్‌ తదితరులు

ఫిలింనగర్‌ న్యూస్‌టుడే: దాదాపు 1250 చిత్రాల్లో నటించిన గొప్ప నటుడు బ్రహ్మానందం అని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా బుధవారం రాత్రి సినీనటుడు బ్రహ్మానందంను ఫిలింనగర్‌ కల్చరల్‌ సెంటర్‌ (ఎఫ్‌ఎన్‌సీసీ) ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి విశేష కృషి చేస్తోందన్నారు. సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ మన సంస్కృతి సంప్రదాయాలను నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. 30 ఏళ్లు ఎఫ్‌ఎన్‌సీసీ పూర్తి చేసుకుంటున్న సందర్భంలో బ్రహ్మానందంను సత్కరించే కార్యక్రమాన్ని చేపట్టడం పట్ల మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. సినీ నటులు బ్రహ్మానందం మాట్లాడుతూ.. కోట్ల మంది అభిమానులకు నవ్వించే భాగ్యం కలగడం తన అదృష్టమన్నారు. సినీ దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌,  ఎఫ్‌ఎన్‌సీసీ అధ్యక్షులు జి.ఆదిశేషగిరిరావు, కార్యదర్శి ముళ్లపూడి మోహన్‌, ఫిలింనగర్‌ సొసైటీ కార్యదర్శి కాజ సూర్యనారాయణ, గాయకులు వందేమాతరం శ్రీనివాస్‌, రాహుల్‌సిప్లిగంజ్‌, సినీ నటులు శివాజీరాజా, ఉత్తేజ్‌, నిర్మాత టి.ప్రసన్నకుమార్‌, చాముండేశ్వరినాథ్‌, తుమ్మల రంగారావు, రాజశేఖర్‌రెడ్డి, కె.వెంకటేశ్వరరావు, కొండేటి సురేష్‌, జె.బాలరాజు, శైలజ, గోపాల్‌రావు, హాస్యనటుడు నటులు శివారెడ్డి, ఆది, మానస్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని