logo

బాచుపల్లి ఠాణా నూతన భవనం ప్రారంభం రేపు

బాచుపల్లి ఠాణా నూతన భవనాన్ని ఊరగుట్టపై 1.31 ఎకరాల విస్తీర్ణంలో ఆధునిక సదుపాయాలతో దాదాపు రూ.4 కోట్ల విరాళాలతో 3 అంతస్తుల్లో నిర్మించారు.

Published : 23 Mar 2023 02:29 IST

నిజాంపేట, న్యూస్‌టుడే: బాచుపల్లి ఠాణా నూతన భవనాన్ని ఊరగుట్టపై 1.31 ఎకరాల విస్తీర్ణంలో ఆధునిక సదుపాయాలతో దాదాపు రూ.4 కోట్ల విరాళాలతో 3 అంతస్తుల్లో నిర్మించారు. హోంమంత్రి మహమూద్‌ అలీ శుక్రవారం ప్రారంభించనున్నట్లు సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర బుధవారం ప్రకటన విడుదల చేశారు. గతనెలలోనే ఆరంభం కావాల్సి ఉండగా ఎమ్మెల్సీ ఎన్నిక కోడ్‌తో వాయిదా పడింది. జిల్లా, మండలాల పునర్విభజన సమయంలో 11.10.2016న బాచుపల్లి ఠాణా ఏర్పాటైంది. అప్పటి నుంచి అద్దె భవనంలో కొనసాగుతోంది. 2021లో ఈ నూతన భవనానికి శంకుస్థాపన చేయగా అరబిందో ఫార్మా కంపెనీ సీఎస్‌ఆర్‌లో భాగంగా రూ.3.5 కోట్లతో నిర్మాణానికి ముందుకొచ్చింది. మిగతా రూ.50 లక్షలు దాతలిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు