పండగపూట విషాదం
స్నేహితులతో విహారయాత్రకు వెళ్లిన ఓ యువకుడు మృతిచెందాడు. తుర్కయంజాల్ కమ్మగూడ గ్రామం శ్రీశ్రీనగర్ కాలనీకి చెందిన గౌని జగదీష్ గౌడ్...
నాగార్జునసాగర్ బ్యాక్ వాటర్‌లో గల్లంతై యువకుడి మృతి
తుర్కయంజాల్ పురపాలిక, న్యూస్‌టుడే: స్నేహితులతో విహారయాత్రకు వెళ్లిన ఓ యువకుడు మృతిచెందాడు. తుర్కయంజాల్ కమ్మగూడ గ్రామం శ్రీశ్రీనగర్ కాలనీకి చెందిన గౌని జగదీష్ గౌడ్, శారద దంపతులకు కుమారుడు శివకుమార్‌గౌడ్, ఇద్దరు కుమార్తెలున్నారు. కుమార్తెల పెళ్లిళ్లయ్యాయి. గౌని శివకుమార్ గౌడ్(30) స్థానికంగా ఎస్‌బీఐలో పొరుగుసేవల ఉద్యోగి. ఇటీవలే ఉద్యోగం పర్మినెంట్ అయిన నేపథ్యంలో బుధవారం ఉదయం తోటి ఉద్యోగులు, మరికొంతమంది స్నేహితులతో కలిసి నల్గొండ జిల్లా చందంపేట మండలం వైజాక్ కాలనీలో నాగార్జునసాగర్ బ్యాక్ వాటర్‌కు వెళ్లారు. నది నీటిలో ఈత కొడుతూ అకస్మాతుగా గల్లంతయ్యాడు. వెంటనే పక్కనే ఉన్న ఓ మత్స్యకారుడు నీటిలో దూకి అతన్ని వెలికి తీయగా అప్పటికే మృతిచెందాడు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
భారతీయులకు వీసాల మంజూరులో జాప్యమేల?
-
Crime News
ప్రియుడి మర్మాంగం కోసిన యువతి
-
Ts-top-news News
భారత్‌లో మహిళలకు బైపాస్ సర్జరీ అనంతర ముప్పు తక్కువే!
-
Ap-top-news News
తిరుమల గగనతలంలో విమానాలు
-
Sports News
బ్యాటింగ్ ఎంచుకోవాల్సింది: మాజీ కోచ్ రవిశాస్త్రి
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (09/06/2023)