logo

సర్కారు భూములు విక్రయాలకు సిద్ధం

సర్కారు భూముల విక్రయాల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు ప్రభుత్వం నిర్ణయించడంతో రాజధాని శివారు ప్రాంతాల్లోని సర్కారు భూముల వివరాలను రంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారులు రెండు రోజుల నుంచి సేకరిస్తున్నారు.

Published : 23 Mar 2023 02:36 IST

భూములను పరిశీలిస్తున్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ హరీష్‌

ఈనాడు, హైదరాబాద్‌: సర్కారు భూముల విక్రయాల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు ప్రభుత్వం నిర్ణయించడంతో రాజధాని శివారు ప్రాంతాల్లోని సర్కారు భూముల వివరాలను రంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారులు రెండు రోజుల నుంచి సేకరిస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో రాజేంద్రనగర్‌, సరూర్‌నగర్‌ మండలాల్లో ప్రభుత్వ స్థలాలను జిల్లా కలెక్టర్‌ ఎస్‌.హరీష్‌ స్వయంగా పరిశీలించారు. ఆ స్థలాల్లో ఎక్కడా ఆక్రమణలు లేవని స్థానిక రెవెన్యూ అధికారులు ఆయనకు వివరించారు. ఆయా ప్రాంతాల్లో బహిరంగ మార్కెట్‌లో భూముల ధరలు, ప్రభుత్వం నిర్ణయించిన ధరలను అధికారులు వివరించారు. వీటి ద్వారా రూ.100 కోట్ల ఆదాయం లభిస్తుందని అంచనా.

గరిష్ఠంగా రెండెకరాలు..

రాజేంద్రనగర్‌, కందుకూరు రెవెన్యూ డివిజన్లలో ప్రభుత్వ భూములు కనిష్ఠంగా 6 గుంటలు, గరిష్ఠంగా 2 ఎకరాల వరకూ ఉన్నాయి. రికార్డులను పక్కాగా పరిశీలించి హెచ్‌ఎండీఏకు అప్పగిస్తారు.

రంగారెడ్డి, మేడ్చల్‌పైనే గురి..

రంగారెడ్డి జిల్లాలో 10, మేడ్చల్‌లో 6 ప్లాట్లను హెచ్‌ఎండీఏకు 2 నెలల కిందట స్వాధీనం చేశారు. వాటికి ఈ ఏడాది జనవరిలో 9 ప్లాట్లకు వేలం నిర్వహించగా రూ.195.24 కోట్ల ఆదాయం లభించింది. మధ్య తరగతి ప్రజలు కొనేందుకు వీలుగా ప్లాట్‌ కనిష్ఠ పరిమాణాన్ని 121 గజాలుగా విభజించారు. ప్రస్తుతం 16 ప్లాట్లకు ఆన్‌లైన్‌ ద్వారా వేలం నిర్వహించనున్నారు. సరూర్‌నగర్‌, బాలాపూర్‌, రాజేంద్రనగర్‌ భూములను తర్వాత విక్రయించే అవకాశాలున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు