logo

జాతీయ రహదారులు హరితమయం

వరంగల్‌, నాందేడ్‌ జాతీయ రహదారులపై రూ.18.61 కోట్లతో చేపట్టిన మల్టీలేయర్‌ ప్లాంటేషన్‌ పనులు పూర్తయ్యాయని హెచ్‌ఎండీఏ బుధవారం ప్రకటనలో పేర్కొంది.

Updated : 23 Mar 2023 06:49 IST

వరంగల్‌ జాతీయ రహదారిపై..

ఈనాడు, హైదరాబాద్‌: వరంగల్‌, నాందేడ్‌ జాతీయ రహదారులపై రూ.18.61 కోట్లతో చేపట్టిన మల్టీలేయర్‌ ప్లాంటేషన్‌ పనులు పూర్తయ్యాయని హెచ్‌ఎండీఏ బుధవారం ప్రకటనలో పేర్కొంది. రూ.15.04 కోట్ల వ్యయంతో వరంగల్‌ హైవే(ఎన్‌హెచ్‌ 163)పై 64 కిలోమీటర్లు, రూ.3.57 కోట్లతో నాందేడ్‌ జాతీయ రహదారి(ఎన్‌హెచ్‌-161)పై 33 కిలోమీటర్ల సెంట్రల్‌ మిడెన్‌ గ్రీనరీ, మల్టీలేయర్‌ పనులతో జాతీయ రహదారులు హరితమయమయ్యాయని పేర్కొంది. ఇప్పటికే శ్రీశైలం జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌-765)పై శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టు నుంచి మహేశ్వరం వరకు 18 కిలోమీటర్లు, కర్నూలు జాతీయ రహదారి ఆరాంఘర్‌ నుంచి షాద్‌నగర్‌ వరకు 25 కిలోమీటర్లు, శామీర్‌పేట్‌ నుంచి గజ్వేల్‌ వరకు దాదాపు 39 కిలోమీటర్ల వరకు చేపట్టిన సెంట్రల్‌ మిడెన్‌ గ్రీనరీ, మల్టీలేయర్‌ ప్లాంటేషన్‌ పనులతో పచ్చదనం కనువిందు చేస్తోందని వివరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని