బంధనాలు వేయకు.. భవిత చీకటిమయం చేయకు
ఈ నెల 17న పూడూర్ మండలానికి చెందిన ఓ బాలికను మహారాష్ట్ర, ముంబయిలో పెళ్లి చేసుకున్న వరుడిపై బంధువుల ఫిర్యాదుతో పోక్సో కేసు, ఇరు వర్గాలకు చెందిన తల్లిదండ్రులపై బాల్య వివాహ నిషేధ చట్టం-2012 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
జిల్లాలో పెరుగుతున్న బాల్య వివాహాలు
15 మాసాల్లో 214 నిలిపివేత
న్యూస్‌టుడే, వికారాబాద్, తాండూరు, తాండూరు గ్రామీణ
ఈ నెల 17న పూడూర్ మండలానికి చెందిన ఓ బాలికను మహారాష్ట్ర, ముంబయిలో పెళ్లి చేసుకున్న వరుడిపై బంధువుల ఫిర్యాదుతో పోక్సో కేసు, ఇరు వర్గాలకు చెందిన తల్లిదండ్రులపై బాల్య వివాహ నిషేధ చట్టం-2012 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
ఫిబ్రవరి 11న తాండూర్ మండలంలో ముందస్తు సమాచారంతో బాలల హక్కుల పరిరక్షణ సమితి బాల్య వివాహాన్ని నిలిపి వేసింది. ఇరు వర్గాల కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ నిర్వహించి బాల్య వివాహం చేయమని లిఖితపూర్వక హామీ తీసుకున్నారు.
కుటుంబ, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా.. బాల్య వివాహాలతో అనర్థాలు తప్పవని వీటిని నిర్మూలించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చట్టాలను అమల్లోకి తెచ్చాయి. ఇంతజరిగినా జిల్లాలో తరచూ ఎక్కడో ఓచోట వెలుగు చూస్తున్నాయి. దీంతో ప్రభుత్వ యంత్రాంగం మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన పరిస్థితి నెలకొంది.
నియంత్రించేందుకు కఠిన నిబంధనలు: 18 ఏళ్లు నిండని బాలిక, లేదంటే 21 ఏళ్లు నిండక ముందే యువకుడు పెళ్లి చేసుకున్నట్లయితే బాల్య వివాహం కిందకు వస్తాయి. 21 ఏళ్లు పూర్తి చేసుకున్న యువకుడు 18 ఏళ్లు నిండని బాలికను పెళ్లి చేసుకొని కాపురం చేస్తే పోక్సో కేసు నమోదు చేస్తారు. ఇలాంటి బాల్య వివాహాలు జీవో ఎంఎస్ 13, 2012 ప్రకారం నేరం. ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన చట్టాన్ని అతిక్రమించి బాల్య వివాహాలు చేసుకుంటే బాధ్యులైన వారు 2 ఏళ్లు జైలు శిక్ష లేదా రూ.లక్ష జరిమానా, ప్రత్యేక సందర్భాల్లో రెండు శిక్షలను ఒకేసారి విధించే అవకాశం ఉంది.
ఎన్నెన్నో కారణాలు..
పేదరికం, నిరక్షరాస్యత, బాల్య వివాహాల నిర్మూలన చట్టంపై అవగాహన లేమి, ఆర్థిక పరిస్థితులు, సమస్యలపై చైతన్యం లేకపోవడం, ఆడపిల్లలు ఎక్కువగా ఉండి భారం దించుకోవాలని భావించడం తదితరాలు కారణాలుగా నిలుస్తున్నాయి. ప్రేమ మోజుతో బాల, బాలికలు చెడు దారి పట్టకుండా తల్లిదండ్రులు ముందుగానే వివాహం చేయాలని నిర్ణయించుకోవడం కూడా ఒక ప్రధాన కారణంగా నిలుస్తోంది.
యంత్రాంగం అప్రమత్తం
జిల్లాలో 2022 జనవరి నుంచి డిసెంబరు వరకు 182, జనవరి 2023 నుంచి ఇప్పటి వరకు 32 బాల్య వివాహాలను అంటే 15 మాసాల్లో మొత్తం 214 బాల్య వివాహాలను ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తతతో వ్యవహరించి నిలిపివేసింది.
ఎవరినీ ఉపేక్షించం..
బాల్య వివాహాల విషయంలో తల్లిదండ్రులు, బంధుమిత్రులు బాధ్యులు ఎవరైనా ఉపేక్షించేది లేదు. సమాచారం ఇచ్చినవారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. బాల్య వివాహాలకు సిద్ధమైన, సహకరించిన వారిపై కేసు నమోదు తప్పదు.
లలితకుమారి, జిల్లా స్త్రీ, శిశు సంక్షేమాధికారిణి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Cosmetic Surgeries: సౌందర్య చికిత్సతో ఫంగల్ మెనింజైటిస్.. కలవరపెడుతున్న మరణాలు
-
Politics News
PM Modi: భాజపా పాలిత రాష్ట్రాల సీఎంలతో అధిష్ఠానం కీలక భేటీ
-
World News
Graduation Day: విద్యార్థులకు బిలియనీర్ సర్ప్రైజ్ గిఫ్ట్.. కారణమిదే!
-
General News
Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
India News
Wrestlers protest: రెజ్లర్లపై దిల్లీ పోలీసుల తీరు దారుణం.. బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేయాల్సిందే..!
-
Politics News
Chandrababu: ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’.. ఎన్నికల వరాలు ప్రకటించిన చంద్రబాబు