logo

నీరు శుభ్రం... నిర్వహణ అధ్వానం

జిల్లాలోని గ్రామాల్లో ఎండా కాలం ముదరక ముందే తాగునీటి సమస్య తీవ్రమవుతోంది. ఓవైపు మిషన్‌ భగీరథ పథకం నడుస్తున్నా నిర్వహణ సక్రమంగా లేక తాగేందుకు ప్రజలు చొరవ చూపలేకపోతున్నారు.

Published : 24 Mar 2023 02:44 IST

పర్యవేక్షణ లోపంతో గాడి తప్పుతున్న భగీరథ
గ్రామాల్లో ఎద్దడి ఛాయలు
న్యూస్‌టుడే, పరిగి, వికారాబాద్‌ కలెక్టరేట్‌, కుల్కచర్ల, దౌల్తాబాద్‌, బషీరాబాద్‌, తాండూరు  

పరిగిలో మోటార్ల ద్వారా తోడి పడుతున్నారు

జిల్లాలోని గ్రామాల్లో ఎండా కాలం ముదరక ముందే తాగునీటి సమస్య తీవ్రమవుతోంది. ఓవైపు మిషన్‌ భగీరథ పథకం నడుస్తున్నా నిర్వహణ సక్రమంగా లేక తాగేందుకు ప్రజలు చొరవ చూపలేకపోతున్నారు. ఎండలు పెరిగేకొద్దీ నీటి వాడకం ఎక్కువవుతోంది. సమస్యలు కూడా పెరుగుతాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, భగీరథ నీటి సరఫరాను సక్రమంగా నిర్వహించాల్సిన అవసరం తదితర అంశాలపై ‘న్యూస్‌టుడే’ ‘పరిశీలనాత్మక’ కథనం.

సమావేశాల్లో చర్చిస్తున్నా స్పందన లేదు

తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు మిషన్‌ భగీరథను అమలు చేస్తున్నారు. పల్లెపల్లెనా పైప్‌లైన్లు, మంచినీటి పథకాలను ఏర్పాటుచేశారు. లక్ష్యం మంచిదే అయినా నిర్వహణ లోపం ప్రధాన సమస్యగా మారింది. క్షేత్ర స్థాయిలో లోపాలను సరిచేయాలని మండల సర్వసభ్య సమావేశాల్లో ప్రజా ప్రతినిధులు మొత్తుకుంటున్నా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతోంది.

* పరిగి మండలం రాఘవాపూర్‌ సమీపాన ఉన్న సంపు ద్వారా జిల్లాలోని అన్ని పంచాయతీలు, మున్సిపాలిటీలకు నీటి సరఫరా జరుగుతోంది. గ్రామాల్లో పనులపై పర్యవేక్షణ లేకపోవడంతో నీటి పంపిణీ అస్తవ్యస్తంగా మారింది.

కొన్ని ఉదాహరణలు

* పరిగి, పెద్దేముల్‌, దౌల్తాబాద్‌, బషీరాబాద్‌, కుల్కచర్ల, వికారాబాద్‌, దౌల్తాబాద్‌ మండలాల్లో ఎద్దడి ఛాయలు కనిపిస్తున్నాయి. 

* ట్యాంకులను శుభ్రం చేయకుండానే భగీరథ నీటిని సరఫరా చేస్తున్నారు. దీంతో నీరు వాసనతో కూడి ఉంటోంది. 

కుల్కచర్ల మండలం తిర్మలాపూర్‌లో భగీరథ నీటి సరఫరా సక్రమంగా సాగడంలేదు. ట్యాంకరు ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు.  

* ఇదే మండలంలోని ఇప్పాయిపల్లిలో గ్రామ పంచాయతీలో 13 సింగిల్‌ ఫేజ్‌ మోటార్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ఇక్కడ కూడా భగీరథ సవ్యంగా లేదు.

* పరిగి మండలం తొండపల్లి గ్రామంలో నాలుగేళ్ల క్రితం నీటి సరఫరా నిమిత్తం కొత్తగా భూ ఉపరితల ట్యాంకును ఏర్పాటు చేశారు. నిండా నీరు నింపడం లేదు. దీంతో పాత ట్యాంకును నింపి వినియోగిస్తున్నారు. 

* దాడితండాలో రెండు మూడు రోజులకోసారి నీరందుతోంది.

* ఇటీవలే పెద్దేముల్‌ మండలంలోని మారేపల్లి గ్రామస్థులు తాగునీటి కోసం రోడ్డెక్కి నిరసన తెలిపారు

* దౌల్తాబాద్‌ మండలంలోని దేవరపస్లాబాద్‌ గ్రామంలో భగీరథ పైప్‌లైన్‌ లీకేజీ కావడంతో పలు గ్రామాలు, తండాలో సరఫరా నిలిచిపోయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని